BigTV English

Veera Dheera Sooran OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన విక్రమ్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..?

Veera Dheera Sooran OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన విక్రమ్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..?

Veera Dheera Sooran OTT: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈయన ఇటీవల నటించిన యాక్షన్ చిత్రం ‘వీర ధీర శూర : పార్ట్ 2’. ఉగాది సందర్భంగా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయింది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం రివీల్ చేస్తూ.. ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఏప్రిల్ 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీర ధీర శూర: పార్ట్ 2 సినిమా ఓటిటికి రాబోతోంది అని స్పష్టం చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


వీర ధీర శూర : పార్ట్ 2 సినిమా కథ ఇదే..

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. విక్రమ్ కాళి అనే పాత్రలో నటించగా.. దుషారా విజయన్ ఆయన భార్య వాణి పాత్రలో నటించారు. ఈ జంట పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే కాళీ గతం వేరు. ఆ ఊర్లో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి రవి (30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి) అనే ఒక పెద్ద మనిషికి నమ్మకమైన అనుచరుడిగా మెలుగుతూ చాలా గొడవల్లో తల దూర్చిన చరిత్ర కాళిది. గతాన్ని మరిచిపోయి పూర్తిగా కొత్త జీవితాన్ని గడుపుతుండగా.. మళ్లీ రవి.. కాళి ఇంటికి వచ్చి ఒక సహాయం కోరుతాడు. తనని, తన కొడుకు కన్నాని ఎన్కౌంటర్ చేయాలనుకున్న ఎస్పీ అరుణగిరిని అంతం చేయాలని కోరుతాడు.దానికి కాళీ ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఎస్ పీ కి, రవికి మధ్య వైరం ఏంటి? అందులో కాళి ప్రమేయం ఏమైనా ఉందా? తన కుటుంబం జోలికి వచ్చిన వ్యక్తులను కాళి ఏం చేశాడు అనేదే ఈ సినిమా స్టోరీ.


ప్రేక్షకులను మెప్పించిందా..?

సాధారణంగా రెండో పార్ట్ సినిమాలు మొదటి భాగం విడుదలైన తర్వాత వాటికి సీక్వెల్స్ గా వస్తాయి. కానీ ఈ సినిమా మాత్రం ముందు రెండో భాగం కథతోనే వచ్చింది. అందుకే పార్ట్ 2 అని పేరు పెట్టి మరీ ఈ సినిమాను విడుదల చేశారు. ఇక తదుపరి ఈ సినిమాకి ముందు ఏం జరిగింది అనే కథతో రానుంది. ఈ సినిమాలో కథ కంటే సంఘటనలే ఆసక్తికరంగా సాగాయి. పాత్రలు అనూహ్యంగా నడుచుకునే విధానం, ఉత్కంఠకు గురి చేసే యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకుడిని చూపుతిప్పుకోనికుండా చేశాయి. ముఖ్యంగా నటీనటులు కూడా తమ శక్తికి మించి ఇందులో నటించారు. అందుకే ఈ సినిమా కూడా అటు ఆడియన్స్ ని బాగా మెప్పించింది.

Urvashi Rautela: దక్షిణాదిలో నాకు గుడి కట్టండి.. నార్త్ పై ఊర్వశీ ఊహించని కామెంట్స్..!

Related News

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ఒంటరి అమ్మాయి కంటికి కన్పిస్తే వదలని కామాంధులు… హీరోయిన్ దెబ్బతో సీన్ రివర్స్

OTT Movie : భర్తను వదిలేసి ఆటగాడితో ఆంటీ అరాచకం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఏం సినిమారా బాబూ… 50 కోట్లు పెడితే 550 కోట్లకుపైగా కలెక్షన్స్… ఓటీటీలోకి థియేటర్లలో దుమ్మురేపిన రొమాంటిక్ మూవీ

OTT Movie : పేరుకే 118 ఏళ్ల వృద్ధుడు… ముగ్గురమ్మాయిలతో లవ్ స్టోరీ… మైండ్ బెండయ్యే సై-ఫై మూవీ

OTT Movie : సైకో నుంచి మనుషుల్ని తినే మనిషి వరకు… ఒకే సినిమాలో 6 స్టోరీలు… గుండె గుభేల్మన్పించే హర్రర్ మూవీ

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి 17 చిత్రాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..!

Paradha OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movie : ఓనర్స్ ను చంపి అదే ఇంట్లో తిష్ఠ వేసే సైకో… పోలీసులను పరుగులు పెట్టించే కిల్లర్… క్లైమాక్స్ డోంట్ మిస్

Big Stories

×