E-Paper
Advertisement

Urvashi Rautela : ‘వాల్తేరు వీరయ్య’తో బాలీవుడ్ బ్యూటీ మాస్ స్టెప్పులు

Urvashi Rautela : ‘వాల్తేరు వీరయ్య’తో బాలీవుడ్ బ్యూటీ మాస్ స్టెప్పులు
Advertisement

Urvashi Rautela : మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజా రవితేజ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫైనల్ స్టేజ్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. అందులో భాగంగా చిరంజీవి, రవితేజలపై ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ సాంగ్‌లో చిరు, రవితేజల పక్కన్న ఎవరినీ స్టెప్పులేయించాలని మేకర్స్ చాలానే ఆలోచించారు. చివరకు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను రంగంలోకి దించారు.

రీసెంట్‌గానే రామ్ పోతినేని, బోయపాటి శ్రీను చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించిన ఊర్వశి రౌతేలా ఇప్పుడ వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, రవితేజలతోనూ ఆడిపాడింది. స్పెషల్ సాంగ్స్‌కు అదిరిపోయే ట్యూన్స్ అందించే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తనదైన మార్క్ మాస్ బీట్‌ను అందించారని చిత్ర యూనిట్ చెబుతుంది. శేఖర్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేశారట. రీసెంట్‌గా విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి తమ్ముడి పాత్రలో రవితేజ కనిపించబోతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×