Big Stories

Markets gained in weekend : వీకెండ్ లో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets gained in weekend : భారత స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలున్నా… చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 60,950 పాయింట్ల దగ్గర ముగియగా… నిప్టీ 64 పాయింట్ల లాభంతో 18,117 పాయింట్ల దగ్గర ముగిసింది.

- Advertisement -

అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచడం, మరిన్ని పెంపులు తప్పవన్న సంకేతాలివ్వడం… అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఆ ఎఫెక్ట్ మన సూచీలపైనా పడింది. ఉదయం సెన్సెక్స్ 60,698 పాయింట్ల దగ్గర లాభాల్లో మొదలైనా… ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 61,004-60,666 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరి అరగంట ముందు వరకు నష్టాల్లోనే ఉన్న సూచీలు… కనిష్టస్థాయిల దగ్గర కొనుగోళ్లు మొదలవడంతో లాభాలబాట పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరపడంతో… చివరికి సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌-30 సూచీలో 18 షేర్లు లాభపడ్డాయి. లోహ రంగ షేర్లు 4 శాతం దాకా పెరగ్గా… ప్రభుత్వ బ్యాంకుల షేర్లు ఒక శాతం మేర లాభపడ్డాయి. ఫార్మా రంగ షేర్లు ఒక శాతం మేర నష్టపోయాయి.

- Advertisement -

ఇక… డాలరుతో రూపాయి మారకం విలువ 47 పైసలు బలపడి… 82 రూపాయల 41 పైసల వద్ద ముగిసింది. గురువారం సెషన్ లో 8 పైసల మేర నష్టపోయిన రూపాయి… శుక్రవారం ఏకంగా 47 పైసలు లాభపడింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News