BigTV English

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Ustaad Bhagat Singh:ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అప్‌డేట్ అంటే ఫ్యాన్స్ కి పూన‌కాలే. అందులోనూ న్యూ ఇయ‌ర్ ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌, ప‌వ‌ర్‌స్టార్ సినిమాల నుంచి ఏమేం అప్‌డేట్స్ వ‌స్తాయా? అని కాచుకుని కూర్చున్నారు అభిమానులు. వాళ్ల ఆస‌క్తిని గ‌మ‌నించి ఓ అప్‌డేట్ వ‌దిలారు డైర‌క్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌. హ‌రీష్ శంక‌ర్ డైర‌క్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన గ‌బ్బ‌ర్‌సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే.ఆ మూవీని మించేలా నెక్స్ట్ సినిమాను తీయాల‌ని వెయిట్ చేస్తున్నారు హ‌రీష్ శంక‌ర్‌. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ స్క్రిప్ట్ అంతే బాగా వ‌చ్చింద‌ట‌. స్క్రిప్ట్ మీద ముచ్చ‌ట‌ప‌డి టైటిల్‌ని కూడా భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ నుంచి ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌గా మార్చారు. ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌కి సోష‌ల్ మీడియాలో యుఎస్‌బి ది ఫిల్మ్ అని హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇదే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.


ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ఫుల్ స్వింగ్ మీద ఉందంటున్నారు మేక‌ర్స్. ఆర్ట్ డైర‌క్ట‌ర్ ఆనంద్‌సాయితో క‌లిసి హ‌రీష్ శంక‌ర్ డిస్క‌ష‌న్స్ జ‌రుపుతున్న స్టిల్‌ని రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో ఆర్టిస్టు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంద‌ని కూడా అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, నంద‌మూరి బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాల రిలీజ్ ప‌నుల్లో ఉంది మైత్రీమూవీమేక‌ర్స్. ఈ ప‌నులు కాస్త పూర్తికాగానే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అంత‌లోనే హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్‌ని పూర్తి చేయాల‌నుకుంటున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఈ లోపే ఖుషీ రీరిలీజ్ కూడా అవుతుంది. ఈ ఇయ‌ర్ ఎండింగ్‌, వ‌చ్చే ఏడాది స్టార్టింగ్‌లోనూ ఫుల్లుగా సినిమాల అప్‌డేట్స్ తో ఫ్యాన్స్ కి ద‌గ్గ‌రగా ఉంటారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×