BigTV English

Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. పబ్ లపై చర్యలు.. న్యూ ఇయర్ ఎఫెక్ట్

Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. పబ్ లపై చర్యలు.. న్యూ ఇయర్ ఎఫెక్ట్

Hyderabad: డిసెంబర్ 31st నైట్. 11:59 టైమ్. 10..9..8.. అంటూ కౌంట్ డౌన్. ఒక్కసారిగా కేరింత. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తుళ్లింత. అంతా హంగామా. ఎక్కడ చూసినా గోల గోల. హైదరాబాద్ లో ఈ సందడి మరింత ఎక్కువ.


ట్యాంక్ బండ్ పరిసరాలు న్యూ ఇయర్ ఈవెంట్ కు అడ్డా. యువతకు డిసెంబర్ 31st నైట్ డెస్టినేషన్. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ మొత్తం పబ్లిక్ తో నిండిపోతుంది. రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. కేరింతలతో హోరెత్తుతుంది. అయితే, కొందరు ఆకతాయిలు వాహనాలతో రోత రోత చేస్తుండటంతో పోలీసులు కొన్నేళ్లుగా అక్కడ ఆంక్షలు విధిస్తున్నారు. ఈసారి కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి.. సోమవారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ లో వాహనాలను అనుమతించరు.

ఇక, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున.. నగరంలోని ఫ్లైఓవర్లపైనా వాహనాలను నిషేధించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అవుటర్ రింగ్ రోడ్డుపై మాత్రం ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఆ మేరకు పోలీసులకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.


మరోవైపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్ లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ పెట్టరాదని ఆదేశించింది. న్యూ ఇయర్ ఈవెంట్స్ లో కూడా 10pm తర్వాత సౌండ్ బంద్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే, ఈ నిషేధం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పబ్స్ కి మాత్రమే.

అటు, న్యూ ఇయర్ సందడికి క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైంది హైదరాబాద్ మెట్రో రైల్. మామూలు రోజుల్లో రాత్రి 11 గంటలకే మెట్రో లాస్ట్ ట్రైన్. కానీ, డిసెంబర్ 31న మాత్రం అర్థరాత్రి 1 గంట వరకు మెట్రో రైల్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

సందట్లో సడేమియాలా పోలీసులు సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 31 రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక క్యాబ్స్, ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లు ప్రజలను ప్రయాణాలకు నిరాకరించకూడదని పోలీసులు తెలిపారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×