BigTV English
Advertisement

Samyuktha Menon:- బ‌న్నీ సినిమాలో సంయుక్తా మీన‌న్‌!

Samyuktha Menon:- బ‌న్నీ సినిమాలో సంయుక్తా మీన‌న్‌!


Samyuktha Menon:- టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో అంద‌రినీ ఆక‌ర్షిస్తోన్న బ్యూటీ సంయుక్తా మీన‌న్‌. ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ క్రేజీ ఆఫ‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకుంద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో వినిస్తున్నాయి. ఇంత‌కీ ఆ క్రేజీ మూవీ ఆఫ‌ర్ ఎవ‌రితోనే తెలుసా!.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో. వివ‌రాల్లోకి వెళితే, ప్ర‌స్తుతం పుష్ప 2 ది రూల్ సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న సందీప్ రెడ్డి వంగా మూవీలో న‌టించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. కానీ.. మీడియా వ‌ర్గాల్లో మాత్రం మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి వినిపిస్తోంది.

అదేంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ చేయ‌బోయే సందీప్ వంగా సినిమా గ్యాప్‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. అదెవ‌రితోనో కాదు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కాగా.. అస‌లు అనౌన్సే కానీ బ‌న్నీ, త్రివిక్ర‌మ్ సినిమాకు సంబంధించిన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌గా న‌టించ‌బోతుంద‌ని. ఇదే క‌నుక నిజ‌మైతే హీరోయిన్‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే దారులు సంయుక్తా మీన‌న్‌కు సుగ‌మ‌మైన‌ట్లే. త్రివిక్ర‌మ్‌కు సంబంధించిన సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో కానీ, ఆయ‌న స‌న్నిహిత బ్యాన‌ర్స్‌లో సంయుక్తా మీన‌న్ సినిమాలు చేస్తోంది.


ఇప్పుడెలాగూ ఆమెను అంద‌రూ గోల్డెన్ హీరోయిన్ అంటున్నారు. అదీగాక విరూపాక్ష సినిమాలో త‌న‌దైన పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకుంది కూడా. ఇదే ఆమెకు బ‌న్నీ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ని గుస గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలేంటో తెలియాంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రస్తుతం సంయుక్తా మీనన్ చేతిలో ఉన్న సినిమా డెవిల్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×