
Ustaad Bhagat Singh:- పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ద్వయం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రీకరణతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఓ స్పీడుని మెయిన్‌టెయిన్ చేసిన పవర్ స్టార్.. ఇప్పుడు గేరు మార్చారు. చాలా వేగంగా తన సినిమాలను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే PKSDT సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇలా సినిమా పూర్తయ్యిందో లేదో అలా ఎడిటింగ్ పనులను మొదలు పెట్టేశారు చిత్ర యూనిట్. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తెలియజేశారు. ఎడిటింగ్ పనులను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసేశారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క ‘గబ్బర్ సింగ్’ సినిమా. అది కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. దీంతో వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమాపై హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. తమిళ చిత్రం తెరిని రీమేక్ చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయటంలో హరీష్ శంకర్ దిట్ట. తెరి నుంచి బేస్ పాయింట్‌ను మాత్రమే తీసుకుని పూర్తిగా చేంజస్ చేసి తెరకెక్కిస్తున్నాడని టాక్. మూవీపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘గబ్బర్ సింగ్’ని మించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అద్భుతమైన చిత్రాన్ని అందించాలని దర్శకుడు హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోన్న సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఘన విజయంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఎంతటి కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. మరోసారి ఆ స్థాయి సంగీతంతోమ్యాజిక్ చేయటానికి రాక్ స్టార్ రెడీ అయిపోయారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ పని చేస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.