
Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్ ల ద్వారా నటిగా కెరియర్ ను మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య బేబీ మూవీ తో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ కుర్రకారు మది దోచడమే కాకుండా.. క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అందాల భామ ఒక సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో తెలుగు అందం , అభినయం ఈ స్థాయిలో గుర్తింపు రావడం నిజంగా విశేషమనే చెప్పాలి.
ఇప్పటివరకు టాలీవుడ్ లో చాలామంది తెలుగు భామలు తమ లక్ ట్రై చేసుకున్నారు. అయితే వైష్ణవి మాత్రం నెక్స్ట్ జనరేషన్ తెలుగు అమ్మాయి గా ,స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎదుగుతుందని అందరూ భావిస్తున్నారు.ఇప్పటికే బడా బడా ప్రొడక్షన్ హౌసెస్ వైష్ణవితో మూవీస్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాయి అని టాక్. ఆమె కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ నిర్మాణంలోనే వైష్ణవి సెకండ్ మూవీ చేయబోతోంది.
ఈ మూవీలో ఆమెతో బేబీ మూవీలో జతకట్టిన ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను కూడా ఇటీవల చిత్ర బృందం విడుదల చేశారు. అయితే ఈ మూవీ పోస్టర్ చూసి అందరూ బేబీ సీక్వెల్ మూవీ వస్తోంది అని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పిక్ సోషల్ మీడియాలో చాలా హల్ చల్ చేస్తోంది. ఆ విషయం కాస్త పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ అమ్మడుకి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.
మరి ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో వైష్ణవి చైతన్య అప్డేట్ కోసం ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ తెలంగాణ బ్యూటీ బతుకమ్మ సంబరాలు, దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ ఫొటోస్ ను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఒక పిక్ వైరల్ గా మారింది.
తెల్లచీరలో దేవకన్యలా పచ్చని బంతిపూల బతుకమ్మను నీళ్లలో వదులుతూ వైష్ణవి సరస్సులో హంసలాగా ఉంది. ఈ ఒక్క ఫోటోకి 1.73 లక్షల మంది లైక్ కొట్టారు అంటే ఈ బ్యూటీ తన అందంతో ఎంత మంది మనసు దోచిందో చూడండి. ఆమె ఫ్యాన్స్ లవ్ , హార్ట్ ఎమోజిస్ తో కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. తన ఇన్స్టా అకౌంట్లో ఈ బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేసుకున్న వైష్ణవి అభిమానులకు దసరా , బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా వైరల్ గా మారింది.