BigTV English

Vaishnavi Chaitanya with DJ Tillu: డీజే టిల్లుతో ముస్లిం అమ్మాయిగా ‘బేబీ’.. ఏ సినిమాలో తెలుసా..?

Vaishnavi Chaitanya with DJ Tillu: డీజే టిల్లుతో ముస్లిం అమ్మాయిగా ‘బేబీ’.. ఏ సినిమాలో తెలుసా..?

Vaishnavi Chaitanya Playing Muslim Girl Role in Siddu Jonnalagadda’s Jack Movie: యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. ఇప్పుడు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిలిమ్స్, సిరీస్‌లతో యూట్యూబ్ ఆడియన్స్‌ను ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్ము గతేడాది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ, సాయి రాజేష్ కాంబో ‘బేబి’ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.


ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయాన్ని అందుకుని బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. అయితే ఈ మూవీలో వైష్ణవి యాక్టింగ్‌కు ఫిదా అవ్వాల్సిందే. ప్రేమ జంటల కళ్లలోంచి కన్నీళ్లు తెప్పించింది. ఆమె యాక్టింగ్‌కే కాదు డాన్స్‌కు కూడా సెల్యుట్ చేయనివారుండరు. ఈ మూవీతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన వైష్ణవికి సినిమా ఆఫర్లు వరుసగా వచ్చి పడ్డాయి.

ప్రస్తుతం ఈమె చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అందులో ‘లవ్ మీ’ అనే మూవీ చేస్తుంది. ఈ మూవీ మే 25న అంటే రేపు రిలీజ్ కానుంది. ఇందులో ఆశిష్ హీరోగా నటిస్తుండగా.. అతడికి జోడీగా వైష్ణవి నటిస్తుంది. ఇదొక హారర్, థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్లలో పాల్గొంటున్న వైష్ణవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.


Also Read: దెయ్యాన్ని చూస్తే అది చంపేస్తుంది.. చూడకపోతే వీడు చచ్చేలా ఉన్నాడు

బేబి సినిమా తర్వాత తనని చాలా మంది ట్రోల్ చేశారని తెలిపింది. తాను ఆంధ్రా అమ్మాయి అయినా.. తెలంగాణ అమ్మాయిలా మాట్లాడటానికి ట్రై చేస్తుందని విమర్శలు చేశారని పేర్కొంది. అయితే వీటిపై తాను ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చానని.. తాను ఆంధ్రా అమ్మాయిని కాదని.. హైదరాబాదీ అమ్మాయినే అని చెప్పినా విమర్శలు చేస్తున్నారని తెలిపింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది.

‘‘నేను విజయవాడ అమ్మాయి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నేను పక్కా హైదరాబాదీ అమ్మాయిని. ఓల్డ్ సిటీ, చంద్రయాన్ గుట్ట అమ్మాయిని. నేను పుట్టింది.. పెరిగింది ఇక్కడే’’ అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాగే తన తదుపరి సినిమా గురించి కూడా తెలిపింది. తన తర్వాత సినిమా సిద్ధూ జొన్నలగడ్డతో ‘జాక్’ సినిమాలో చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మూవీలో తాను ముస్లిం అమ్మాయిగా నటిస్తున్నట్లు పేర్కొంది. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఆమె ముస్లిం అమ్మాయి పాత్రలో కూడా అదరగొడుతుందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×