BigTV English

Rainy Skin Care Tips: వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం అద్భుతమైన చిట్కాలు..

Rainy Skin Care Tips: వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం అద్భుతమైన చిట్కాలు..

Rainy Season Skin Care Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏదో ఒక విధంగా చర్య సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. తరచూ వర్షంలో తడిసి ఇంటికి వచ్చే వారిలో చర్మం పొడిబారే సమస్య వెంటాడుతూ ఉంటుంది. వర్షం నీటిలో తడవడం, జిడ్డు చర్మం, దుమ్ము, ధూళి వంటి వాటి కారణంగా చర్మ సంరక్షణ కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఇలాంటి సమయంలో మొటిమలు, మచ్చలు, జిడ్డు వంటివి కూడా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం ఆరోగ్యాన్ని కోల్పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి తగిన చిట్కాలు పాటించాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


హైడ్రేషన్:

వర్షాకాలంలో చర్మం కాలుష్యం కారణంగా అనారోగ్యానికి గురవుతుంది. అందువల్ల చర్మాన్ని సంరక్షించుకోవాల్సి ఉంటుంది. ప్రతీరోజూ రెండు నుంచి మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరచూ మాయిశ్చరైజర్ ను ఉపయోగించడం మాత్రం మానుకోవద్దు.


ఎక్స్‌ఫోలియేట్:

వర్షాకాలంలో జిడ్డు పేరుకుని ఏర్పడే మొటిమలను తొలగించుకోవడానికి స్ర్కబర్లు వాడాల్సి ఉంటుంది. ఇవి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి తోడ్పడతాయి. ఇలా ప్రతీ రోజూ రెండు సార్లు ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, సురక్షితంగా ఉంటుంది.

Also Read: Obesity Health Tips: అధిక బరువుతో అనారోగ్య సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సన్‌స్క్రీన్‌:

ఎండాకాలంలోనే కాకుండా ప్రతీ సీజన్ లోను సన్ స్క్రీన్‌ను వాడాల్సి ఉంటుంది. యూవీ కిరణాలు, దుమ్ము, ధూళి వంటి వాటి నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది.

సరైన ఆహారం:

సీజన్ కు తగినట్లు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

Tags

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×