BigTV English

Varalaxmi Sarathkumar: నన్నే రూమ్ కు రమ్మన్నాడు.. కాస్టింగ్ కౌచ్ పై వరలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు

Varalaxmi Sarathkumar: నన్నే రూమ్ కు రమ్మన్నాడు..  కాస్టింగ్ కౌచ్ పై వరలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు

Varalaxmi Sarathkumar: కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళ్ లో మంచి మంచి సినిమాలు చేసిన వరూ.. తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె ఆహార్యం, గంభీరం చూసి అందరూ ఫిదా అయ్యారు. స్టార్ హెఓరోలకు ధీటుగా నిలబడి డైలాగ్ లు చెప్పిన తీరుకు మంత్ర ముగ్ధులు అయ్యారు. ప్రస్తుతం వరలక్ష్మీ ఒకపక్క విలన్ గా కొనసాగుతూనే ఇంకోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సై అంటుంది.


తాజాగా ఆమె నటించిన చిత్రం శబరి. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్,సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన వరలక్ష్మీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తోంది. తాజగా ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మీ.. స్టార్ హీరో కూతురును అయ్యి కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు తెలిపింది.

” ఇండస్ట్రీలో అమ్మాయిలు రాణించడం చాలా కష్టం. నేను.. నాన్నకు ఇష్టం లేకున్నా ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో స్ట్రగుల్ అయినా.. ఆ తరువాత మంచిగా పేరు తెచ్చుకున్నాను. ఆ సమయంలోనే తమిళనాడుకు చెందిన ఒక టీవీ ఛానెల్ ఓనర్ నా దగ్గరకు వచ్చాడు. ఒక ప్రాజెక్ట్ ఉంది, కలిసి పనిచేయాలని కోరాడు. నేను కూడా ఓకే చెప్పాను. కొద్దిసేపు తరువాత మనం బయట కలుద్దాం అన్నాడు. నేను ఎందుకు అని అడిగితే.. అలా మాట్లాడుకుందాం.. రూమ్ బుక్ చేస్తాను అన్నాడు. ఒక హీరో కూతురు అయిన నన్నే ఇలా అడిగితే.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని అమ్మాయిల పరిస్థితి ఏంటి.. ? అనిపించింది. వెంటనే అతనిపై కేసు పెట్టాను. ఈ ఘటన జరిగి ఆరేళ్ళు అవుతుంది. స్టార్ హీరో కూతురుగా ఉన్నాను అని నాకేం అవకాశాలు రాలేదు.. కమిట్ మెంట్ అడగకుండా లేరు. అన్ని చూసాను. కొన్ని అవకాశాలు నేను వదులుకున్నాను.. మరికొన్నిటిలో నన్ను తీసేశారు” అని వరూ చెప్పుకొచ్చింది. మరి శబరి సినిమాతో వరలక్ష్మీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×