BigTV English

Varalaxmi Sarathkumar: క్రాక్ జయమ్మ పెళ్లి.. హడావిడి అంతా టాలీవుడ్ దే

Varalaxmi Sarathkumar: క్రాక్ జయమ్మ పెళ్లి.. హడావిడి అంతా టాలీవుడ్ దే

Varalaxmi Sarathkumar: కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. పెళ్లి వద్దు.. వద్దు అంటూనే ఆమె ఎట్టకేలకు ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడనుంది. నటుడు శరత్ కుమార్ నటవారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరలక్ష్మీ.. అందరిలా తాను సెలబ్రిటీ కూతురును, హీరోయిన్ గానే చేస్తాను అని అనకుండా తన సత్తాకు తగ్గట్టు పాత్రలను ఎంచుకుంటూ వచ్చి స్టార్ గా మారింది.


హీరోయిన్ గా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి మెప్పించింది. తెలుగులో క్రాక్ సినిమాలో జయమ్మ గా నటించి తెలుగు కుర్రాళ్లకు గాలం వేసింది. ఒక సినిమాలో హీరోయిన్ తో పాటు విలన్ ను కూడా అభిమానులు ఆదరించారు అంటే అది వరుకు మాత్రమే సొంతమైన రికార్డు. ఇక ఈ సినిమా తరువాత జయమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవడమే కాకుండా వరుసగా స్టార్ హీరో సినిమాల్లో నటించి అలరించింది.

సినిమాల విషయం పక్కన పెడితే వరుకు మొదటి నుంచి డేరింగ్ ఎక్కువే. ఏ విషయాన్నీ అయినా సూటిగా చెప్పుకొస్తూ ఉంటుంది. అప్పట్లో విశాల్ తో పెళ్లి అన్నప్పుడు కూడా తడబడకుండా.. తాను మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ తరువాత పెళ్లి చేసుకోను అని.. ఆ సమయం వచ్చినప్పుడు జరుగుతుంది అని చెప్పిన వరు.. సడెన్ గా ఈ ఏడాది మార్చిలో నికోలాయ్ సచ్‍దేవ్‍తో నిశ్చితార్థం చేసుకుంది. అతడికి ఇప్పటికే మొదటి వివాహం అయినా కూడా.. ఆ మాట అడిగినవారికి గట్టిగా సమాధానం చెప్పి మరీ నికోలాయ్ వివాహమాడుతోంది ఈ భామ. వీరి వివాహం జూలై 2 న థాయ్ ల్యాండ్ లో ఘనంగా జరగనుంది.


ఇక ఆమె పెళ్లికి ఆమె అన్ని దగ్గరుండి చూసుకొంటుంది. ముఖ్యంగా తన పెళ్లి కార్డులు తానే స్వయంగా పంచుతుంది. టాలీవుడ్ లోనే ప్రముఖులందరికి వరునే ఇంటికి వెళ్లి.. స్పెషల్ గా పిలుస్తుంది. డైరెక్టర్స్, హీరోస్, ప్రొడ్యూసర్స్, హీరోయిన్స్.. ఏ ఒక్కరిని వదలకుండా పెళ్ళికి ఆహ్వానించింది. అది కూడా నిండైన చీరకట్టుతో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలిచింది. సమంత దగ్గరనుంచి నయనతార వరకు అందరిని వెడ్డింగ్ కార్డు ఇచ్చి ఆహ్వానించింది. చూడబోతుంటే.. వరు పెళ్ళిలో టాలీవుడ్ దే హంగామా అంతా అన్నట్లు కనిపిస్తుంది. మరి వరు పెళ్ళికి ఎవరెవరు అటెండ్ అవుతారో చూడాలి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×