BigTV English

Varsham Re release: 21 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ప్రభాస్ వర్షం మూవీ.. ఎప్పుడంటే..?

Varsham Re release: 21 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ప్రభాస్ వర్షం మూవీ.. ఎప్పుడంటే..?

Varsham Re release..గత రెండు మూడు సంవత్సరాలుగా రీ రిలీజ్ చిత్రాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే 4K లో మళ్లీ రిలీజ్ చేసిన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటే కలెక్షన్లు బాగా సాధిస్తాయి. లేకపోతే బోల్తా కొట్టాల్సిందే. ఇకపోతే ఇప్పుడు ప్రభాస్(Prabhas ) కెరియర్ లోనే బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ‘వర్షం’ సినిమా మళ్లీ 21 ఏళ్ల తర్వాత వెండితెరపై చూసే అవకాశం లభిస్తోంది. ఇటీవలే వర్షం సినిమాను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేయడానికి డేట్ కూడా ఖరారు చేశారు చిత్ర బృందం. వచ్చేనెల అనగా మే 23వ తేదీన థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 4k వెర్షన్లో వెండితెర పైకి రాబోతోంది. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా థియేటర్లలో రాబోతున్న నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్ తో సహా రిలీజ్ చేయడం జరిగింది.


మ్యాజిక్ క్రియేట్ చేసిన వర్షం సినిమా..

రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లోనే వర్షం సినిమా చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు.పైగా ప్రభాస్ కు ఈ సినిమా ఫస్ట్ బ్లాక్ బాస్టర్ కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ సినిమాతోనే ప్రభాస్ కి ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. శోభన్ దర్శకత్వంలో 2004 జనవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది.ముఖ్యంగా ఈ సినిమా ఏదో మాయ చేసి ప్రభాస్ కి భారీ విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. మొత్తానికైతే వర్షం సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ నెంబర్లతో దూసుకుపోయింది. ఇందులో ప్రభాస్ కి జోడిగా త్రిష నటించిన విషయం తెలిసిందే ఇక వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాతనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చినా.. ఈ విషయంపై వీరు స్పందించలేదు.


ALSO READ; HIT 3 Censor : సెన్సార్ రిపోర్ట్… నాని వీరంగం… చూస్తే భయపడాల్సిందే..

వర్షం మూవీ కలెక్షన్స్..

లవ్ స్టోరీ,కామెడీ, యాక్షన్ కలబోతతో ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా 2004 జనవరి 14న విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫుల్ రన్ ముగిసే సరికి ఈ సినిమా దాదాపు రూ.32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా కేవలం రూ.8కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కింది. కానీ ఈ రేంజ్ లో లాభం అంటే నిర్మాతలు భారీగా లాభపడ్డారు. ఇక ఇందులో ప్రభాస్ యాక్షన్, స్క్రీన్ ప్రెజెంట్స్ , డైలాగ్ డెలివరీ, స్టైల్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టెంపుల్లో నందీశ్వరుడు దగ్గర వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలిచాయి. అలా మొత్తానికైతే 21 సంవత్సరాల క్రితం యువతను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అయితే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×