HIT 3 Censor..హిట్: ది థర్డ్ కేస్.. ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) రచన, దర్శకత్వంలో రాబోతున్న తెలుగు భాషా క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. వాల్ పోస్టర్, యునానిమస్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ప్రశాంతి తిపిరినేని, నాని నిర్మిస్తున్నారు. హిట్ యూనివర్స్ లో మూడవ భాగం కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హిట్ సీక్వెల్ గా హిట్ : ది సెకండ్ కేస్ 2022లో రాగా.. ఇప్పుడు దానికి సీక్వల్ గా హిట్ 3 రాబోతోంది. ఈ సినిమాలో నాని (Nani) సరసన శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) నటిస్తూ ఉండగా వీరితోపాటు ఆదిల్ పాలా, బ్రహ్మాజీ, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్ తదితరులు నటిస్తున్నారు.
సెన్సార్ పూర్తీ చేసుకున్న హిట్ -3
ఇకపోతే హైదరాబాద్, విశాఖపట్నం, జమ్మూకాశ్మీర్ వంటి ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు.. మే ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో మునుపెన్నడూ చూడని విధంగా నానిని ఈ సినిమాలో చూడబోతున్నామని ఇటీవల విడుదల చేసిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. అత్యంత క్రూరంగా మాస్ పర్ఫామెన్స్ తో నాని అలరించబోతున్నారు. పైకి చూడడానికి క్లాస్ గా కనిపించినా.. ఆయన లోపల ఉండే మాస్ క్రూరత్వం సినిమా చూసేవారికి చెమటలు పట్టడం ఖాయమని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇలా భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది.. సెన్సార్ బోర్డు ఇందులో క్రూరత్వం ఎక్కువగా ఉన్న కారణంగా ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇకపోతే ఈ సినిమా 2:35 గంటలు థియేటర్లో ఆడియన్స్ను అలరించబోతోంది. ఇక ఏది ఏమైనా త్వరలో థియేటర్లో నాని వీరంగం చూసి భయపడడానికి సిద్ధం కండి అంటూ అటు మేకర్స్ కూడా పిలుపునిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఇలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
నాని సినిమాలు..
ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ఒకవైపు హిట్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న నాని.. మరొకవైపు ది ప్యారడైజ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా నాని అత్యంత క్రూరంగా కనిపించబోతున్నట్లు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఇలా ఒకవైపు సినిమాలు చేస్తున్న ఈయన మరొకవైపు చిన్న సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల నాని నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో.. శివాజీ , హర్షవర్ధన్, రోషన్, శ్రీదేవి తదితరులు కీలకపాత్రలు పోషించిన చిత్రం కోర్ట్. భారీ అంచనాల మధ్య ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా నాని ఒకవైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ.. భారీ విజయాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.