BigTV English

Pushpa 2 : 6 భారీ ఈవెంట్లు… “పుష్ప 2″కు రాజమౌళి స్ట్రాటజీ ఫాలో అవుతున్న సుక్కు

Pushpa 2 : 6 భారీ ఈవెంట్లు… “పుష్ప 2″కు రాజమౌళి స్ట్రాటజీ ఫాలో అవుతున్న సుక్కు

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2” (Pushpa 2). ఈ మూవీపై ఉన్న హైప్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న “పుష్ప 2” ఈ ఏడాది డిసెంబర్ లోనే థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గా నిర్మాతలు ఈ మూవీకి భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాము అని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో “పుష్ప 2” (Pushpa 2) ప్రమోషన్లపై క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రమోషన్లకు సంబంధించి మేకర్స్ ప్లాన్ బయటకు వచ్చింది. దాన్ని చూస్తుంటే సుక్కూ రాజమౌళి స్ట్రాటజినీ ఫాలో అవుతున్నాడు అన్పించక మానదు.


అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2: ది రూల్” (Pushpa 2) ఖచ్చితంగా భారతదేశంలో అత్యంత అంచనాలు ఉన్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం 2024 డిసెంబర్ 5న విడుదల కానుంది, అంటే ముందుగా అనుకున్నదానికంటే ఒక రోజు ముందుగానే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజా అప్‌డేట్ ప్రకారం మేకర్స్ దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ప్రత్యేక ఈవెంట్‌లను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

“పుష్ప 2” (Pushpa 2) మొదటి ఈవెంట్ నవంబర్ మధ్యలో పాట్నాలో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత కొచ్చి, ముంబై, చెన్నై, హుబ్లీ, తెలుగు రాష్ట్రాల్లోని ఒక ప్రధాన నగరంలో చివరి ఈవెంట్ ముగుస్తుంది. ఈ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ముందుగా మూవీ ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారని సమాచారం. నవంబర్ 15 న భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చివరగా అత్యంత భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి ప్రమోషన్లకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని సమాచారం. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రతి ఈవెంట్‌కు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నారు.


అయితే నిజానికి ఇది రాజమౌళి (Rajamouli) స్ట్రాటజినీ గుర్తు చేస్తోంది. ఆయన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కోసం చెర్రీ, తారక్ లతో కలిసి దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై ఊహించని రేంజ్ లో హైప్ పెరిగింది. ఫలితంగా రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఫలించి మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో కూడా ఇదే ప్లాన్ ను ఫాలో అవుతున్నారు సుక్కూ. అల్లు అర్జున్ తో పాటు చిత్రబృందం అంతా దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనబోతోంది. ఈ ప్లాన్ గనుక వర్కౌట్ అయితే “పుష్ప 2” ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయం.

ఇదిలా ఉండగా “పుష్ప 2” (Pushpa 2)కు సంగీతాన్ని ఫస్ట్ పార్ట్ కు పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. మొదటి చిత్రంలోని పాటలు పెద్ద హిట్‌గా నిలిచాయి. ఈ సీక్వెల్‌కి దేవి ఎలాంటి కొత్త సంగీతాన్ని అందిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్‌లు సెకండ్ పార్ట్ లో కూడా తమ పాత్రలను తిరిగి పోషిస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×