E-Paper
Advertisement

Varun Sandesh: రెబల్ స్టార్ ప్రభాస్ కంటే రూ. 3 కోట్లు ఎక్కువే ఇచ్చిన వరుణ్ సందేశ్

Varun Sandesh: రెబల్ స్టార్ ప్రభాస్ కంటే రూ. 3 కోట్లు ఎక్కువే ఇచ్చిన వరుణ్ సందేశ్
Advertisement

Varun Sandesh: హీరో వరుణ్ సందేశ్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. దానికి కారణం వరుణ్ చేసిన ఆర్థిక సాయం. గత కొన్నిరోజులుగా వయనాడ్ లో జరుగుతున్న మృత్యుఘోష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొండ చరియలు విరిగిపడి ఎంతోమంది మృత్యువాత పడ్డారు. మరెంతోమంది గాయపడ్డారు. ప్రకృతి కోపానికి ఎంతోమని అమాయకులు బలయ్యారు.

ఇక వయనాడ్ బాధితుల సహాయార్థం ఎంతోమంది ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చి మంచి మనసును చాటుకుంటున్నారు. తమిళ్ స్టార్స్ తో పాటు టాలీవుడ్ స్టార్స్ కూడా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కలిపి రూ. 1.5 కోట్లు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాలు అందించారు.

Advertisement

తాజాగా హీరో వరుణ్ సందేశ్ సైతం తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 5 కోట్లు విరాళంగా అందించాడు. ఇక దీంతో వరుణ్ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఒక్కో సినిమాకు కొన్ని కోట్లు తీసుకొనే హీరోల కంటే.. ప్లాపులు అందుకున్నా.. తాను సొంతంగా దాచుకున్న డబ్బును మంచి మనసుతో విరాళంగా అందించిన వరుణ్ సందేశ్ గొప్పతనం గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

2 కోట్లు విరాళంగా అందించిన ప్రభాస్.. రాజు అయితే.. 5 కోట్లు ఇచ్చిన వరుణ్ సందేశ్ నిజంగా రారాజే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక వరుణ్ కెరీర్ గురించి చెప్పాలంటే.. సినిమాలు అయితే చేస్తున్నాడ కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ మధ్యనే విరాజి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నట్లు టాక్. మరి వరుణ్ కమ్ బ్యాక్ ఎప్పుడు అవుతాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×