10 Years for Varun Tej : మెగా హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్. అయితే మొదటి సినిమాతోనే అద్భుతమైన పేరును సాధించుకున్నాడు. ఆ సినిమాలో వరుణ్ తేజ్ నటించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు వరుణ్. వరుణ్ తేజ్ విషయానికి వస్తే ప్రతి సినిమాకి భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్లాడు. మొదటి సినిమా అయిపోయిన వెంటనే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కంచె అనే సినిమాలో నటించాడు వరుణ్ తేజ్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ తో పాటు ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు క్రిష్ కెరియర్ లో సరైన హిట్ సినిమా కూడా పడలేదు అని చెప్పాలి.
అయితే వరుణ్ తేజ్ కెరియర్ లో హిట్ సినిమాలు కన్నా కూడా ప్లాప్ సినిమానే ఎక్కువగా ఉన్నాయి. వరుణ్ చేసిన లవ్ స్టోరీస్ మాత్రం అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఫిదా. వరుణ్ తేజ్ సరసన సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమైన తొలిప్రేమ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. వరుణ్ తేజ్ లోని మరో నటుడిని బయటికి తీసిన సినిమా గద్దల కొండ గణేష్. అయితే రీసెంట్ టైమ్స్ లో వరుణ్ కథలను ఎంచుకునే విధానం కంప్లీట్ గా మారిపోయింది అని చెప్పాలి.
కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టి కేవలం కాన్సెప్ట్ బేస్ సినిమాలు ఎంచుకోవడం మొదలుపెట్టాడు. ఈ తరుణంలో వరుణ్ తేజ్ కెరియర్ లో హిట్ సినిమాలు కన్నా డిజాస్టర్ సినిమాలు ఎక్కువ పడడం మొదలుపెట్టాయి. మళ్లీ మరోసారి కమర్షియల్ సినిమా చేయాలి అని చెప్పి కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమాను చేశాడు వరుణ్ ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఒక ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమాకి మార్కెట్ తగ్గింది అని చెప్పాలి. ఏదేమైనా వరుణ్ తేజ్ 10 ఏళ్ల కెరియర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయి ఎన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి అని విషయాన్ని పక్కన పెడితే, వరుణ్ తేజ్ పై ఇప్పటివరకు ఒక వివాదం కూడా లేదు. అలా కూల్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ జర్నీ ని కొనసాగించాలి అని కోరుకుంటూ, పదేళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా బిగ్ టీవీ తరపున అభినందనలు.
Also Read : New Year 2025 : న్యూ ఇయర్ కు పాత సినిమాల సందడి… రీరిలీజ్ కాబోతున్న 3 తెలుగు సినిమాలు