BigTV English

Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. ఏం టైమింగ్ రా బాబు.. రెచ్చగొట్టడానికేనా.. ?

Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. ఏం టైమింగ్ రా బాబు.. రెచ్చగొట్టడానికేనా.. ?

Pushpa 2:  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పోలీసులు, కేసులు, విమర్శలు, వివాదాలు.. ప్రస్తుతం బన్నీ లైఫ్ లో ఇవే  నడుస్తున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి(39)అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్(9) ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఇక ఈ కేసులో బన్నీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ కేసులు, వివాదాలు , విమర్శలు ఏవి పుష్ప 2 విజయాన్ని ఆపలేకపోయాయి.


టాలీవుడ్ చరిత్రలోనే పుష్ప 2 రికార్డులు సృష్టించింది. దాదాపు  రెండు వారాలు అవుతున్నా ఇంకా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కనిపిస్తుంది. ఇప్పటివరకు రూ. 1500 కోట్లు  రాబట్టి  రికార్డులు సృష్టించింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు  హిందీలో కూడా పుష్ప తన సత్తా చూపించాడు.  ఏ బాలీవుడ్ హీరో కూడా సృష్టించని రికార్డ్ ను బన్నీ క్రియేట్ చేసాడు.

New Year 2025 : న్యూ ఇయర్ కు పాత సినిమాల సందడి… రీరిలీజ్ కాబోతున్న 3 తెలుగు సినిమాలు


ఇదంతా పక్కన పెడితే పుష్ప 2 సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని, నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు కైవసం చేసుకుందని, సంక్రాంతి కానుకగా పుష్ప 2 ఓటీటీలో  రిలీజ్ అవుతుందని వార్తలు వినిపించాయి. అందుకే  పుష్ప 2 చిత్రం నుంచి వీడియో సాంగ్స్  రిలీజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక దీనిపై మేకర్స్ క్లారిటీ  కూడా ఇచ్చారు.

” పుష్ప 2 ది రూల్ ఓటీటీ స్ట్రీమింగ్ పై అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. రాబోయే అతిపెద్ద హాలిడే సీజన్లో ఈ మూవీని థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. విడుదలైన  నాటి నుంచి 56 రోజులు కన్నా ముందు పుష్ప 2  ఓటీటీలో స్ట్రీమింగ్ కాదు. ” అని క్లారిటీ ఇచ్చారు. ఇక దీంతో ఓటీటీ మీద ఫ్యాన్స్ ఆశలు  వదులుకున్నారు. తాజాగా ఈ చిత్రంను ఒక ఊపు ఊపిన సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Allu Arjun: తప్పు ఒప్పుకున్న అల్లు అర్జున్.. విచారణలో వెక్కి వెక్కి ఏడుస్తూ..?

పుష్ప 2 లోని సాంగ్స్ అన్ని ఒక ఎత్తు.. దమ్ముంటే  పట్టుకోరా షెకావత్ అనే  చిన్న బిట్  ఒక ఎత్తు. ఆ నాలుగు లైన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. షెకావత్ తో సవాలు చేసి.. పుష్ప ఈ నాలుగు లైన్స్ ను వార్నింగ్ చెప్పినట్లు చెప్తాడు. దమ్ముంటే  పట్టుకోరా షెకావత్ .. పట్టుకుంటే  వదిలేస్తా సిండికేటు. మళ్లీ భుజాన  గొడ్డలేసి.. కూలీగా పోతాను నేను అడివికేసి.  ఈ లైన్స్ ను రైమింగ్ లో  పాడుతూ మిగతావారితో పాడిస్తాడు పుష్ప. ఇప్పుడు ఆ నాలుగు లైన్స్ కు డీజే మిక్స్ చేసి సాంగ్ లా రిలీజ్ చేశారు.

సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ఈ సాంగ్ పైనే అందరి చూపు.  ఇక అల్లు అర్జున్ ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఈ సాంగ్ ను  రిలీజ్ చేసారని నెటిజన్స్  మాట్లాడుకుంటుంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి  సాంగ్ రిలీజ్ చేసి ట్రోలర్స్ ను రెచ్చగొట్టడం దేనికి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×