New Year 2025 : టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండ్ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఒకానొక టైంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడవడంతో, ఆ టైమ్ లో రిలీజ్ అయిన సినిమాలు థియేటర్లను షేక్ చేశాయి. కానీ ఇప్పుడు మాత్రం కొత్త సినిమాల కోసం మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే న్యూ ఇయర్ కానుకగా టాలీవుడ్ నుంచి పెద్దగా సినిమాలేమీ రిలీజ్ కావట్లేదు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కల్ట్ క్లాసిక్ గా నిలిచిన కొన్ని తెలుగు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి.
2025 జనవరి 1న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పాత సినిమాలు రీ-రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘సై’ (Sye). ఈ మూవీలో నితిన్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని మరోసారి న్యూ ఇయర్ కానుకగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
ఇక న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ కాబోతున్న రెండవ సినిమా ‘ఓయ్’ (Oy). యంగ్ హీరో సిద్ధార్థ, షామిలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ కల్ట్ క్లాసిక్ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశాన్ని న్యూ ఇయర్ సందర్భంగా కల్పించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సునీల్, అలీ, కృష్ణుడు, ఎంఎస్ నారాయణ, తనికెళ్ల భరణి, సప్తగిరి వంటి ప్రముఖ నటులు నటించిన సంగతి తెలిసిందే.
ఇక కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ కాబోతున్న మరో ఇంటరెస్టింగ్ మూవీ ‘హిట్లర్’ (Hitler). ‘విశ్వంభర’ మూవీతో జనవరిలో మెగాస్టార్ ప్రేక్షకులను అలరించనున్నాడని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ‘గేమ్ చేంజర్’ రంగంలోకి దిగడంతో చిరంజీవి పక్కకు తప్పుకున్నారు. దీంతో మెగాస్టార్ రాకపోయినా సరే కనీసం ‘గేమ్ ఛేంజర్’ వస్తుంది కదా అని కొంతవరకు సరిపెట్టుకున్నారు మెగా అభిమానులు. కానీ న్యూ ఇయర్ కానుకగా చిరంజీవికి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన ‘హిట్లర్’ మూవీ రిలీజ్ అవుతుండడంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
నిజానికి ఈసారి న్యూ ఇయర్ రోజున కొత్త సినిమాలు ఏమీ రిలీజ్ కావట్లేదు. కాబట్టి ఈ రీ-రిలీజ్ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది. కానీ ఈ సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్ పై ఎంతవరకు ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది చూడాలి. అయితే పాత సినిమాలే అయినప్పటికీ ఒకేసారి థియేటర్లలో మూడు సినిమాలు పోటీ పడుతుండడం విశేషం.
ఇక ఈ ముగ్గురు హీరోల్లో కేవలం మెగాస్టార్ (Chiranjeevi) మాత్రమే ఇంకా ఫుల్ జోష్ లో ఉన్నారు. సిద్ధార్థ్ (Siddharth), నితిన్ (Nithiin) డీలా పడిపోయారు. నితిన్ హిట్టు కోసం చాలా కాలం నుంచి కష్టపడుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.