Varun Tej Matka Movie Scam : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని చాలా ప్యాషన్ తో బాగా చదువుకున్న దర్శకులు వస్తూ ఉంటారు. అలానే బాగా చదువుకుని పై చదువులు చదివి, జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్లి, బాగా సంపాదించి మంచి సినిమాలు తీయాలనే ఆలోచనతో ముందుకు వచ్చే నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ గురించి బయట పలు రకాల వార్తలు వినిపిస్తూ వస్తుంటాయి. ఇండస్ట్రీ అంటే అదొక సముద్రం అంత ఈజీగా అక్కడ సక్సెస్ కాలేము, అలానే అడుగడుగునా తొక్కే వాళ్ళు ఉంటారు అంటూ చెబుతూ ఉంటారు. ఇదంతా టాలెంట్ విషయానికి సంబంధించింది. అయితే నిజమైన టాలెంట్ ఎప్పటికైనా బయటికి వస్తుంది అని కొంతమంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ నిర్మాతగా సక్సెస్ అవ్వాలన్నా కూడా కష్టమైన పని అని కొందరు రుజువు చేస్తూ వస్తున్నారు. ఎంతో ప్యాషన్ తో సినిమాలు చేయాలని వచ్చిన వారికి కూడా కొన్ని మోసాలు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
శౌర్యవ్ దర్శకుడుగా పరిచయమైన హాయ్ నాన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించడం మాత్రమే కాకుండా దర్శకుడికి అవార్డు కూడా తీసుకొచ్చి పెట్టింది. నాని కెరియర్ లో ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ‘హాయ్ నాన్న’ లాంటి హిట్ సినిమా తీసిన వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో భారీ గోల్ మాల్ జరిగింది.
మట్కా సినిమా ఆఫీస్‌లో స్కాం
హాయ్ నాన్న సినిమా తర్వాత కరుణ కుమార్ దర్శకుడుగా వరుణ్ తేజ్ హీరోగా మట్కా అనే సినిమాను ఈ సంస్థ నిర్మించింది. మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ పెట్టి ఆ సినిమా సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అసలు ఒక మెగా హీరో సినిమాకి ఇలా జరుగుతుంది అని ఎవరు ఊహించలేదు. కొన్నిచోట్ల ఆడియన్స్ లేక షో క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుని నిర్మాతకు నష్టాలను మిగిల్చింది.
2.5 కోట్ల దోపిడి…
ఒక ఆలోచనను నమ్మి సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. అయితే కొన్నిసార్లు అది వర్క్ అవుట్ అవుతుంది వర్క్ అవుట్ కాకపోవచ్చు. వర్కౌట్ కాకపోతే దాని నుంచి కొంతమేరకు కోలుకొని బయటకు రావచ్చు. కానీ ఆ సినిమాను నిర్మించే ప్రాసెస్ లో బాగా నమ్మిన వాళ్లే ఆ నిర్మాతకు టోకరా పెడితే దానిని తట్టుకోవటం కష్టమైన పని. ‘మట్కా’ సినిమా విషయానికి వస్తే ఈ ఆఫీస్‌లో భారీ స్కామ్ జరిగినట్లు తెలుస్తుంది. నిర్మాతకు ఏకంగా రూ.2.5 కోట్లకు టోపీ పెట్టారు సీఈఓ సతీష్. ఈ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాత నమ్మి ‘మట్కా’ బాధ్యత అంతా సీఈవో సతీష్‌కు అప్పగిస్తే ఓచర్లని తారుమారు చేసి, కమీషన్లకు కక్కుర్తి పడినట్లు తెలుస్తుంది. నెలకు రూ.2.5 లక్షల జీతం తీసుకుంటూ.. అన్నం పెట్టిన సంస్థకే కన్నం కన్నం వేశాడు సీఈవో సతీష్ అని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.
కార్ల రెంట్‌తో అదనపు ఆదాయం…
అంతేకాకుండా అదే సంస్థలో సొంత ఇన్నోవా, క్రిస్టా కార్లను రెంట్ కు నడుపుతూ మరో రూ.2 లక్షలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ లెక్కలను నిర్మాత తెలుస్తున్నారు. త్వరలోనే చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.
ఇప్పటికే నిర్మాతకు 15 కోట్ల నష్టం…
ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ మట్కా మూవీ ఫస్ట్ డే నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో వరుణ్ తేజ్ కెరీర్‌లో మరో డిజాస్టర్ పడింది. మెగా హీరో కాబట్టి వరుణ్ తేజ్ కెరీర్‌పై పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు. కానీ, కోట్ల రూపాయలు పెట్టిన నిర్మాతపై ఈ డిజాస్టర్ చాలా ప్రభావం చూపించింది. మట్కా మూవీ వల్ల వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ కి 15 కోట్ల వరకు నష్టం వచ్చింది. దీంతో వారి పర్స్ మొత్తం ఖాళీ అయిపోయినట్టు తెలుస్తుంది.
ఇంకా అప్పులు తీర్చలేదు…
మట్కా వల్ల వచ్చిన నష్టాలను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇంకా తీర్చలేదట. ఈ రోజు వరకు ఇంకా 7 కోట్ల రూపాయలను 24 క్రాఫ్ట్స్ లో పని చేసిన వాళ్లకు నిర్మాత ఇవ్వాల్సి ఉంది.
ఇలా 15 కోట్ల నష్టాలు, 7 కోట్ల రూపాయల అప్పులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైరా పై సీఈవో సతీష్ చేసిన 2.5 కోట్ల దోపిడీ మరింత భారంగా మారిపోయింది.