BigTV English
Advertisement

Varun Tej: వ‌రుణ్ తేజ్ కొత్త మూవీ టైటిల్‌.. ‘గాండీవధారి అర్జున’ మోష‌న్ పోస్ట‌ర్

Varun Tej: వ‌రుణ్ తేజ్ కొత్త మూవీ టైటిల్‌.. ‘గాండీవధారి అర్జున’ మోష‌న్ పోస్ట‌ర్

Varun Tej:డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేసే యువ కథానాయకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. VT 12గా గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. గురువారం వ‌రుణ్ తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.


మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే మాస్క్ ధ‌రించిన మ‌నుషులు కొంద‌రు ఓ రాజ భ‌వ‌నంలోనికి ప్ర‌వేశించ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అలాంటి సంద‌ర్భంలో బాంబుల మోత‌, గ‌న్ ఫైరింగ్ న‌డుమ వ‌రుణ్ తేజ్ యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపిస్తున్నారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ గ్లింప్స్‌లోనే ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ఇందులో మ‌న మెగా ప్రిన్స్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్‌గా న‌టిస్తున్నారు. ఎదుటి వారిని ప్ర‌మాదాల బారి నుంచి కాపాడే రోల్‌లో వ‌రుణ్ తేజ్ న‌టించ‌టం వ‌ల్ల ఈ టైటిల్‌ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తుంది.

ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న టెరిఫిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. వ‌రుణ్ తేజ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబోలో వ‌స్తున్న తొలి చిత్ర‌మిది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×