BigTV English

Chat gpt :- చాట్‌జీపీటీకి కూడా సమర్పించుకోవాల్సిందేనా?

Chat gpt :- చాట్‌జీపీటీకి కూడా సమర్పించుకోవాల్సిందేనా?

Chat gpt:- మరో రెండేళ్లలో గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందనే అంచనాలున్న చాట్‌జీపీటీని వాడుకోవాలంటే నెలనెలా సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు చెల్లించాల్సిందేనా? అంటే… ఔననే సమాధానమే వినిపిస్తోంది. నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో… పెద్దఎత్తున పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందేందుకు… ట్విట్టర్‌ తరహాలో పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు… చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ ప్రయత్నాలు ప్రారంభించింది.


ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో తయారు చేసిన సాఫ్ట్‌వేరే ఈ చాట్‌జీపీటీ. దీని నిర్వహణ ఖర్చులు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన సామ్ ఆల్ట్‌మాన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. యూజర్లు చేసే ఒక్కో చాట్‌కు కొన్ని సెంట్స్‌ ఖర్చు చేయాల్సి వస్తోందని, డేటాను భద్రంగా ఉంచేందుకు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేస్తున్నామని ఆయన తెలిపాడు. మరోవైపు ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్‌ మరో 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుండటంతో… పెట్టుబడులపై లాభాలు పొందేందుకు… ట్విట్టర్ మాదిరే పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని… ఆల్ట్‌మాన్‌ చెప్పారు.

పెయిడ్‌ వెర్షన్ సర్వీసుల్ని చాట్‌జీపీటీ ప్రొఫెషనల్‌ పేరుతో యూజర్లకు అందించనుంది… ఓపెన్ఏఐ. ‘ప్రో’ వెర్షన్‌తో చాట్‌జీపీటీ సేవల్ని యూజర్లకు అందించి… ఆదాయం పొందాలని ఓపెన్‌ఏఐ భావిస్తోంది. ప్రస్తుతం పెయిడ్‌ వెర్షన్‌ ప్రారంభ దశలోనే ఉండగా… పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చిన వెంటనే… పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని తీసుకురాబోతోంది… ఓపెన్ఏఐ.


చాట్‌జీపీటీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే… గూగుల్ పనైపోయినట్లేననే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే… రెండు వారాల వ్యవధిలోనే చాట్‌జీపీటీ 10 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. ఇది ఇలాగే కొనసాగితే… రెండేళ్లలో గూగుల్‌ను దాటేస్తుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. చాట్‌జీపీటీని ఎదుర్కొనేందుకు గూగుల్ ఏం చేయబోతోంది? రెండింటిలో ఏది పైచేయి సాధిస్తుంది? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×