BigTV English

VD 12 : విజయ్ దేవరకొండ సినిమాకు మరో అడ్డంకి.. ఏనుగుల బీభత్సంతో షూటింగ్ రద్దు

VD 12 : విజయ్ దేవరకొండ సినిమాకు మరో అడ్డంకి.. ఏనుగుల బీభత్సంతో షూటింగ్ రద్దు

VD 12 : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు మరో అడ్డంకి ఎదురైంది. ఏనుగులు సృష్టించిన బీభత్సం కారణంగా ఈ సినిమా షూటింగ్ క్యాన్సల్ అయినట్టుగా తెలుస్తోంది.


VD 12 షూటింగ్ క్యాన్సిల్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాను VD12 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. విజయ్ దేవరకొండ తన కెరీర్లో మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఇందులో శ్రీలీల, రష్మిక మందన్న విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ సినిమాను మార్చి 23న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక ఇటీవల ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా, రీసెంట్ గా షూటింగ్ షురూ అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలోని అటవీ ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్స్ లో జరుగుతోంది. అక్కడ ఏనుగులతో కీలక సన్నివేశాలను చిత్ర బృందం ప్లాన్ చేయగా, రెండు ఏనుగులు పోట్లాడడంతో సెట్స్ లో ఉన్న వారందరూ భయాందోళనకు గురైనట్టుగా తెలుస్తోంది.


ఏనుగుల మధ్య జరిగిన ఈ గొడవలో ఓ ఏనుగు గాయాల పాలయ్యి, తప్పించుకొని అడవిలోకి పారిపోయినట్టుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన జరగగా, ఇప్పటి వరకు సదరు ఏనుగు దొరకలేదని. ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది ఆ ఏనుగు ఆచూకింది కనుగొనే పనిలో పడ్డారని తెలుస్తోంది. సినిమా కోసం మొత్తం ఐదు ఎనుగులను తీసుకురాగా, గత వారం రోజులుగా షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. తాజాగా జరిగిన ఏనుగుల గొడవ కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే మిగతా ఏనుగులను ప్రత్యేక వాహనాల్లో అక్కడి నుంచి తరలించారని, తప్పిపోయిన ఏనుగు దొరికేంతవరకు సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని సమాచారం.

విజయ్ దేవరకొండ సినిమాలకు వరుస అడ్డంకులు

విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ కంటే ముందే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కొంతవరకు షూటింగ్ పూర్తయ్యాక విజయ్ దేవరకొండ ఈ సినిమాను పక్కన పెట్టి ‘ఫ్యామిలీ స్టార్’ ను పూర్తి చేశాడు. దీంతో ఆ సినిమా ఆగిపోయింది అని టాక్ నడిచింది. మరోవైపు ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఆశించిన విధంగా ఆడలేదు. పైగా అంతకుముందు ఈ హీరో చేసిన ‘ఖుషి’ మూవీ కూడా అభిమానులను ఖుషి చేయలేక పోయింది. ప్రస్తుతం తాను చేస్తున్న ‘వీడి 12’ మూవీ పైనే విజయ్ దేవరకొండ ఆశలన్నీ పెట్టుకున్నాడు. కానీ ఈ మూవీకి అప్పుడేమో మధ్యలోనే షూటింగ్ ఆగిపోవడం, ఇప్పుడేమో ఏనుగుల వల్ల ఆగిపోవడం వంటి వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×