BigTV English

CM Chandrababu: ఆ విషయంలో వెనక్కి తగ్గం.. సీఎం చంద్రబాబు క్లారిటీ

CM Chandrababu: ఆ విషయంలో వెనక్కి తగ్గం.. సీఎం చంద్రబాబు క్లారిటీ

CM Chandrababu: తిరుమల పవిత్రతను కాపాడతామని భక్తులకు హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకులలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. పరీక్షలు చేసేందుకు ఆధునిక ల్యాబ్‌లను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.


ప్రస్తుతం పరిస్థితులన్నీ ప్రక్షాళన చేస్తామని వివరించారు. ప్రసాదంతోపాటు సౌకర్యాల విషయంలో భక్తుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పకనే చెప్పారు. రెండు రోజుల టూర్‌లో శుక్రవారం సాయంత్రం తిరుమలకు వెళ్లారు సీఎం చంద్రబాబు (Chandrababu) దంపతులు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ క్రమంలో తిరుమలలో వివిధ పనులను ప్రారంభించారు. శనివారం పద్మావతి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి, టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ పని చేశాయని సూచన చేశారు. తిరుమల గిరిల్లో గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు.

ALSO READ: నా వెంట్రుక కూడ పీకలేరు.. కోసి కారం పెట్టండి.. మాజీ మంత్రి నాని సెన్సేషనల్ కామెంట్స్

ప్రశాంతతకు భంగం కలగరాదని చెప్పుకొచ్చారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్టుగా నీటి లభ్యత ఉండేలా ముందస్తు ప్రణాళికలు పేర్కొన్నారు. తిరుమల గిరుల్లో ఇప్పుడున్న అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి వచ్చేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు.

 

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×