BigTV English

Veera Simha : ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాలయ్య మాస్ జాతర అప్పుడే!

Veera Simha : ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాలయ్య మాస్ జాతర అప్పుడే!

Veera Simha : న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై య‌ల‌మంచిలి ర‌వి, న‌వీన్ ఎర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మేక‌ర్స్ శ‌నివారం అధికారిక ప్ర‌క‌ట‌న‌ను ఇచ్చారు. జ‌న‌వ‌రి 12న ‘వీర సింహా రెడ్డి’ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. దీంతో నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి మూడు పెద్ద చిత్రాలు బ‌రిలోకి దిగుతున్నాయి. అందులో ఒక‌టి వాల్తేరు వీర‌య్య‌, మ‌రోటి వీర సింహా రెడ్డి, మూడో చిత్రం వార‌సుడు. అఖండ వంటి సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత బాల‌కృష్ణ న‌టించిన చిత్రం కావ‌టంతో ‘వీర సింహా రెడ్డి’ పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.


బాల‌య్య స‌ర‌స‌న శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దునియా విజయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సినిమా షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంది. ‘వీర సింహా రెడ్డి’ తో పాటు వాల్తేరు వీర‌య్య చిత్రాన్ని కూడా మైత్రీ సంస్థ‌నే నిర్మించింది. మ‌రి వాల్తేరు వీర‌య్య రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా? అని మెగా ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ శ్రుతీ హాస‌నే హీరోయిన్ కావ‌టం కొస మెరుపు. బాల‌య్య న‌టిస్తోన్న 107వ సినిమా వీర సింహా రెడ్డి. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కుతోంది.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×