BigTV English

Venkat Prabhu: దానివల్లే ‘ది గోట్’ ఫ్లాప్ అయ్యింది.. దర్శకుడు వెంకట్ ప్రభు షాకింగ్ కామెంట్స్

Venkat Prabhu: దానివల్లే ‘ది గోట్’ ఫ్లాప్ అయ్యింది.. దర్శకుడు వెంకట్ ప్రభు షాకింగ్ కామెంట్స్

The GOAT Director Venkat Prabhu: కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’ మూవీ ఇటీవల విడుదలయ్యి మిక్స్‌డ్ టాక్ అందుకుంది. సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి ‘ది గోట్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ సినిమా విడుదలయ్యి ఆ అంచనాలను అందుకోలేక యావరేజ్‌గా నిలిచింది. కేవలం తమిళనాడులో మాత్రమే ‘ది గోట్’కు మంచి టాక్ లభించింది. మిగతా భాషా ప్రేక్షకులు మాత్రం ఇది యావరేజ్ అంటూ రివ్యూలు ఇచ్చారు. అయితే అసలు అలా ఎందుకు జరిగింది అనే విషయంపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో ‘ది గోట్’ డిశాస్టర్ అవ్వడానికి కారణాలను ఆయన వివరించారు.


వారికి కనెక్ట్ అవ్వలేదు

తమిళనాడులో ‘ది గోట్’కు రూ.100 కోట్ల ఓపెనింగ్ లభించింది. మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి నూ.275 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. తమిళంలో ఆ రేంజ్‌లో హిట్ అందుకున్న ఈ మూవీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో డిశాస్టర్‌గా నిలిచింది. మామూలుగా దర్శకులు.. తమ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దాని గురించి వివరణ ఇవ్వరు. అలా ఇస్తే మూవీపై మరింత నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని వారు భావిస్తారు. కానీ వెంకట్ ప్రభు అలా కాదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో ‘ది గోట్’ ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఇవే అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు.


Also Read: నానీ సరిపోదా ఈ ఫెయిల్యూర్..దెబ్బ పడిందిగా

నన్ను విమర్శించారు

‘ది గోట్’ మూవీలో ఐపీఎల్ రిఫరెన్స్ చాలానే ఉంది. ముఖ్యంగా అందులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) టీమ్‌ను హైలెట్ చేసి చూపించారు. అంతే కాకుండా దీనికోసం ఎమ్ ఎస్ ధోనీని సైతం రంగంలోకి దించి తనతో గెస్ట్ రోల్ చేయించాడు వెంకట్ ప్రభు. తెలుగు, హిందీ ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ అవ్వకపోవడానికి క్లైమాక్స్‌లో సీఎస్‌కే టీమ్‌ను హైలెట్ చేయడమే అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. తను పర్సనల్‌గా సీఎస్‌కే ఫ్యాన్ అవ్వడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ముంబాయ్ ఇండియన్స్‌కు చెందిన అభిమానులు తనను విమర్శించేవారని అన్నాడు. వెంకట్ ప్రభు చెప్పిన ఈ కారణం విని ప్రేక్షకులు మరింత షాకవుతున్నారు.

అవే కారణాలు

తెలుగు రాష్ట్రాల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. దాన్నిబట్టి చూస్తే ఆ మూవీ ఇక్కడ కూడా హిట్ అవ్వాలి కదా అంటూ వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్‌కు ప్రేక్షకులు స్పందిస్తున్నారు. తను సినిమాను సరిగా తెరకెక్కించకుండా సీఎస్‌కే టీమ్‌పై ఆ ఫెయిల్యూర్‌ను తోసేయడం అస్సలు కరెక్ట్ కాదని అంటున్నారు. పైగా ‘ది గోట్’ సినిమా నిడివి కూడా దీని ఫ్లాప్‌కు కారణమయ్యింది. రొటీన్ స్టోరీ అయినా కూడా యాక్షన్ సీన్స్‌ను బాగా చూపించడం కోసం మూవీ నిడివిని పెంచేశాడని విడుదలయిన మొదటి రోజే ఆడియన్స్ నుండి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇలా తన మూవీలో ఉన్న ఇన్ని మైనస్‌లు గమనించకుండా సీఎస్‌కే టీమ్ రిఫరెన్స్ వల్ల ‘ది గోట్’ ఫ్లాప్ అయ్యింది అనడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు మండిపడుతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×