Sankranthiki Vasthunnaam:ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి మొదలవుతుంది. ఎప్పటిలాగే వచ్చే యేడాది సంక్రాంతికి కూడా ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు తమ సినిమాలతో సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ(Balakrishna )’డాకు మహారాజ్’ తోపాటు వెంకటేష్ (Venkatesh )’సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు పోటీ పడనున్నాయి. ఈ క్రమంలోనే ఈ పెద్ద హీరోలు కూడా తమ సినిమాల విడుదల తేదీలను లాక్ చేసుకోగా.. ఇప్పుడు వెంకటేష్ కూడా తన సినిమా విడుదల తేదీని లాక్ చేసి, అనౌన్స్ చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్ లాక్..
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది అని చిత్ర బృందం ప్రకటించింది. అలాగే బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక నిన్నటి వరకు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. అయితే తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రెస్ మీట్ పెట్టి అందులో డేట్ ని ప్రకటించారు. సంక్రాంతి రోజున అనగా జనవరి 14వ తేదీన సినిమాని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈసారి సంక్రాంతికి వెంకీ మామ ఏ రేంజ్ లో తన పర్ఫామెన్స్ తో మెప్పిస్తారో చూడాలి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా విశేషాలు..
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను దిల్ రాజు(Dilraju) ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్’ పై నిర్మిస్తుండగా.. అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ బ్యూటీస్ మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
ముచ్చటగా మూడోసారి..
ఇకపోతే ఇదివరకే అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబినేషన్లో ఎఫ్2 ఎఫ్3 సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఈ కాంబినేషన్ చూస్తున్నారు. పెద్ద హీరోలు పోటీగా వచ్చినా సరే.. తన సినిమాతో ప్రేక్షకులను మెప్పించి ,సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వెంకటేష్ సినిమా కెరియర్..
నిర్మాతగా అత్యధిక చిత్రాలు నిర్మించి, గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డు సాధించిన డి. రామానాయుడు (D.Ramanaidu) రెండవ కుమారుడే వెంకటేష్. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి ‘కలియుగ పాండవులు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక వెంకటేష్ ఎన్నో చిత్రాలలో నటించగా..అందులో ‘చంటి’, ‘రాజా’ ‘సుందరకాండ’, ‘కలిసుందాం రా’, ‘పవిత్ర బంధం’, ‘బొబ్బిలి రాజా’, ‘ప్రేమించుకుందాం రా’, ‘లక్ష్మీ’,’ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’, ‘సూర్యవంశం’ వంటి చిత్రాలు మంచి గుర్తింపు అందించాయి. 70 కి పైగా సినిమాలలో నటించిన ఈయన ఏడు నంది అవార్డులను అందుకున్నారు. ఇటీవల 75వ చిత్రంగా ‘సైంధవ్’ విడుదలై ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇక ఇప్పుడు 76వ చిత్రం గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వెంకటేష్.