Pushpa 2: తెలుగు నుండి వచ్చే ప్యాన్ ఇండియా సినిమాలకు తిరుగు ఉండడం లేదు. ఇతర భాషా పరిశ్రమల్లో ప్యాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నా.. అవి హిట్ కావడం పెద్ద విషయంగా మారిపోయింది. అందుకే తెలుగు నుండి వచ్చే ప్యాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాల్లో ‘పుష్ఫ 2’ రేసులో ముందుగా దూసుకొస్తోంది. అందుకే ఈ మూవీపై అంచనాలు మాత్రమే కాదు.. దీనికి సంబంధించిన బిజినెస్ కూడా కోట్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే ‘పుష్ఫ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతుండగా తాజాగా దీని టీవీ రైట్స్ గురించి ఒక ఆసక్తికర వార్త బయటికొచ్చింది.
శాటిలైట్ రైట్స్ అప్డేట్
ఇప్పటికే ‘పుష్ప 2’కు సంబంధించిన థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్, డబ్బింగ్ రైట్స్ గురించి ఎన్నో వార్తలు బయటికొచ్చాయి. ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న హైప్ చూసి మేకర్స్ కూడా రైట్స్‌ను అమ్మే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అందుకే ఇప్పటికే ఈ మూవీకి వేల కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ గురించి ఒక ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ‘పుష్ప 2’ (Pushpa 2) టీవీ రైట్స్‌ను కొనుగోలు చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ.. ఈ రైట్స్ కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.
Also Read: ఫ్యాన్స్‌కు భారీ షాక్.. ‘పుష్ప 2’ టికెట్ రేట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఆ రికార్డులు బ్రేక్
‘పుష్ప 2’ మేకర్స్‌కు, పెన్ స్టూడియోస్‌కు మధ్య జరిగిన అగ్రిమెంట్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన బయటికి రాలేదు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘పుష్ప 2’ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా శాటిలైట్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసే రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్టు సమాచారం. ఇంతకు ముందు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రైట్స్ విషయంలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటివరకు ఒక తెలుగు సినిమాకు ఆ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అదే మొదటిసారి. కానీ అప్పుడు ఆ రికార్డులను క్రాస్ చేసే రేంజ్‌లో ‘పుష్ప 2’ బిజినెస్ జరుగుతుందంటే మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఆశగా ఎదురుచూపులు
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ముందుగా నెగిటివ్ టాక్‌తో మొదలయ్యింది. నెగిటివ్ టాక్‌తో మొదలయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ ‘పుష్ప’ అలా కాదు.. నెగిటివ్ టాక్‌తో మొదలయినా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొని ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజం, స్టైల్‌ను ఫాలో అవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వారంతా ‘పుష్ప 2’ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుండడంతో ఈ మూవీకి ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.