E-Paper
Advertisement

Saindhav Movie Teaser : సంక్రాంతి బరిలో సైంధవుడు.. వెంకీమామ ఫుల్ యాక్షన్..

Saindhav Movie Teaser : సంక్రాంతి బరిలో సైంధవుడు.. వెంకీమామ ఫుల్ యాక్షన్..
Advertisement

Saindhav Movie Teaser : ఇప్పటికే సంక్రాంతికి సందడి చేయడానికి అగ్ర హీరోల సినిమాలు పోటీలు పడుతున్నాయి. థియేటర్ ఏ మూవీకి ఇవ్వాలో కూడా అర్థం కాని స్థితిలో ఇండస్ట్రీ ఉంటే మరోపక్క సంక్రాంతి బరిలోకి వెంకీ మామ సైంధవుడిగా వస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విక్టరీ వెంకటేష్ కు 75వ చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సైంధవ్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్.. మూవీపై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది. టీజర్ లో వెంకటేష్ అతని కూతురు భార్య ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను చూపించి.. ఇక అక్కడి నుంచి విలన్ అక్రమంగా ఆయుధాలు తీసుకురావడం, పిల్లలకు ఆయుధాలతో ట్రైనింగ్ ఇవ్వడం లాంటి సన్నివేశాలను చూపిస్తారు. ఆ తర్వాత వెంకటేష్ విలన్ ని హెచ్చరించడం వంటి సీన్లను టీజర్లో చూపించారు.

Advertisement

టీజర్ ను బట్టి చూస్తే.. సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. టీజరే ఇలా ఉంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. ఇక ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ యాక్టర్ ఆర్య,రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, జెర్సీ మూవీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తుండగా.. తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం ,కన్నడ ,హిందీ భాషల్లో కూడా సినిమా విడుదలవుతుంది. ఒకరకంగా వెంకటేష్ కు ఇది తొలి పాన్ ఇండియా సినిమా.

నిజానికి ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 22వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే సరిగా అదే సమయానికి సలార్ రిలీజ్ ఉండటంతో.. సైంధవుడు సంక్రాంతిని టార్గెట్ చేశాడు. ఇప్పటికే సంక్రాంతి బరిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వెంకీ మామ సినిమా కూడా జనవరి 13న రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. భారీ బడ్జెట్ తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలతో వెంకీ మామ తిరిగి ఒకప్పటి గణేష్ జలక్ ను చూపించడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Advertisement

టీజర్ లో ఎంతో కొంత సినిమాకు సంబంధించిన హింట్ ఇవ్వడానికి డైరెక్టర్ ప్రయత్నించాడు. ఇందులో విలన్  నవాజుద్దీన్ సిద్ధిఖీ డ్రగ్ మాఫియా కి సంబంధించిన వ్యక్తి.. ఒక పెద్ద డ్రగ్ అసైన్మెంట్ ని కూడా అతను తీసుకుంటాడు. పైగా చిన్న పిల్లలను సంఘ విద్రోహ శక్తులుగా మార్చడానికి శిక్షణ ఇస్తుంటాడు. అయితే డ్రగ్ మాఫియా కి వెంకటేష్ కి సంబంధం ఏమిటి? గతంలో వెంకటేష్ ఏమి చేసేవాడు? ఇలాంటివి అర్థమయి ,అర్థంకానట్టుగా కాస్త కన్ఫ్యూజ్ చేస్తూ.. చూసే వాళ్ళలో ఆసక్తి కలిగించే విధంగా టీజర్ ఉంది. మొత్తానికి టీజర్ ను సస్పెన్స్ గా కట్ చేసినా.. వెంకటేష్ ను ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ లో చూపించారు. ఈ మూవీ సంక్రాంతికి గట్టి పోటీ ఇస్తుందని విక్టరీ అభిమానులు అంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×