BigTV English
Advertisement

VenkyAnil3: వెంకీ మామ ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చేస్తాడు ఆయన క్లారిటీ ఇచ్చాడు

VenkyAnil3: వెంకీ మామ ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చేస్తాడు ఆయన క్లారిటీ ఇచ్చాడు

VenkyAnil3: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. రచయితగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాలకు రాసి, పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలానే ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా కూడా దాదాపు ఇదే కథ మాదిరిగా ఉంటుంది. అయితే అనిల్ రావిపూడి ఈ కథను చాలా ఫన్నీ వేలు నడిపించి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడు. అనిల్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి పెట్టింది పేరు అనిపిస్తాయి. అందుకే అనిల్ రావిపూడి కెరియర్ లో ఇప్పటివరకు ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ చూడని దర్శకుడు అంటే అనిల్ పేరు చెప్పవచ్చు.


పటాస్ సినిమా తర్వాత చేసిన సుప్రీం రాజా ది గ్రేట్ సినిమాలు ఒక ఎత్తు అయితే, సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎఫ్2 సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఎప్పటినుంచో మిస్సయిన కామెడీ యాంగిల్ ను వెంకటేష్ లో ఆ సినిమాతో తీసాడు అనిల్. అలానే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ఏకంగా సూపర్ సార్ మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా 100 కోట్లు దాటి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక తర్వాత వచ్చిన ఎఫ్ 3 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎఫ్2 ఎంత హిట్ అయిందో అదే స్థాయిలో ఎఫ్ త్రీ సినిమా కూడా హిట్ అయింది.

అయితే అనిల్ రావిపూడి వెంకటేష్ కలిసి మూడవసారి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంక్రాంతి వస్తున్నాం అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి కచ్చితంగా దిల్ రాజు సినిమా ఒకటి రిలీజ్ అయి తీరుతుంది. కానీ ఈ సంక్రాంతికి దిల్ రాజు రెండు సినిమాలను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చాలామందిలో కన్ఫ్యూజన్ ఉండేది అయితే ఒక ట్వీట్ తో ఆ కన్ఫ్యూజన్ కి చెక్ పెట్టేసాడు వెంకీ మామ. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 90% అయిపోయిందని తెలిపారు. అలానే డబ్బింగ్ వర్క్ కూడా మొదలైంది అని అప్డేట్ ఇచ్చారు వీటితో పాటు ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. చాలా క్లారిటీగా సంక్రాంతికి కలుద్దామని విక్టరీ వెంకటేష్ ట్వీట్ చేశారు. ఇక్కడితో ఖచ్చితంగా ఈ సినిమా కూడా సంక్రాంతి బడిలో నిలవనుంది అని ఫిక్స్ అయిపోయినట్లే.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×