BigTV English

Rave Party: జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ కీలక వ్యక్తులు

Rave Party: జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ కీలక వ్యక్తులు

Rave Party: హైదరాబాద్ శివార్లలో వీఐపీల రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. జన్వాడలోని ఓ ఫామ్‌హౌస్‌లో.. రేవ్ పార్టీ జరుగుతున్న చోటి నుంచి భారీగా డీజే శబ్దాలు రావడంతో, స్థానికులు డయల్ హండ్రెడ్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ఫామ్‌హౌస్‌పై స్పెషల్ పార్టీ, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. రేవ్‌ పార్టీలో దొరికిన వారికి టెస్టులు చేయించారు. పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్త విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ రావడంతో.. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఫామ్‌హౌస్‌లో భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. NDPS యాక్ట్‌, సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఫామ్‌హౌస్‌పై దాడిని మాత్రం గోప్యంగా ఉంచారు.


వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి సమయంలో జన్వాడా రిజర్వ్ కాలనీకి చెందిన ఒక ప్రముఖిని ఇంట్లో పార్టీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ డీజే సౌండ్లు భారీగా రావడంతో.. చుట్టుప్రక్కల ఉన్నవారు డయల్ హండ్రెడ్‌కు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. సైబరాబాద్ SOT పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 30 మంది ఆ ఫామ్ హౌస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారీ విదేశీ మద్యం ఉండటంతో.. SOT పోలీసులు వాళ్లందరిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అక్కడ తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా భారీగా విదేశీ మద్యం నిల్వలు  ఆ పార్టీలో వినియోగిస్తుండగా పోలీసులు గుర్తించారు. కొంత మందికి వెంటనే డ్రగ్స్ టెస్టులు చేయగా.. వ్యాపారవేత్త విజయ్ మద్దూరికి డ్రగ్స్ పరీక్షల్లో కొకైన్ పాజిటివ్ రావడంతో.. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వ్యాపారవేత్త విజయ్ మద్దూరి సాఫ్ట్ వేర్ కంపెనీకి CEO గా వ్వహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రముఖుడికి చాలా సన్నిహితుడిగా ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే చాలా మందిని తప్పించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసులు ఈ పార్టీలో విజయ్ మద్దూరితో పాటు ఎవరెవరు పాల్గొన్నారు. ఆపార్టీలో ఉన్న ప్రముఖులు ఎవరనేది ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపైన పోలీసులు స్పందిచాల్సి ఉంది. ప్రస్తుతం అయితే విజయ్ మద్దూరిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనపైన NDPS యాక్ట్‌, సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసారు. ఇంకా కొంతమందికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చే నేపథ్యంలో.. వాళ్లందరిని కూడా ఈరోజు SOT కార్యాలయానికి పిలిపించి విచారించనున్నారు. మరోపక్క భారీగా విదేశీ మద్యం నిల్వలు గుర్తించిన పోలీసులు.. ఆ ఫామ్ హౌస్ యజమానిపైన కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: డీజీపీ సంచలన నిర్ణయం.. 39 మంది కానిస్టేబుల్స్ సస్పెండ్

ఇటీవల వరుసగా అటు శివార్లులోని ఫామ్ హౌస్‌లు అసాంఘిక కార్యాకలాపాలు అడ్డాగా మారుతున్నాయి. తాజాగా నిన్న జరిగిన ఈ రైడ్‌లో చాలా మంది ప్రముఖులు ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీనీ కేటీఆర్ బావమరిది రాజ్‌ పాకాల నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్‌ పార్టీలో కేటీఆర్ భార్య శైలిమ కూడా పాల్గొన్నట్లు సమాచారం. శైలిమ సోదరుడే రాజ్‌ పాకాల. జన్వాడలో బినామీ పేర్లతో అతను విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ నిర్మించుకున్నాడు. అత్యంత సన్నిహితులకు నిన్న రాత్రి ఫామ్‌హౌస్‌లోనే పార్టీ ఇచ్చాడు. పోలీసుల రైడ్‌తో రాజ్ పాకాల రేవ్‌ పార్టీ బాగోతం బయటపడింది. ఇతరలు అనేక మంది అందులో ఉన్నట్లు తెలుస్తోంది.  అందుకే దీన్నంతటిని కొంతవరకు గోప్యంగా ఉంచుతున్నారనే వార్తలు వినుపిస్తున్నాయి. విజయ్ మద్దూరిని అయితే ప్రస్తుతం SOT కార్యాలయానికి తరలించారు. అతను కొకైన్ ఎవరిదగ్గరి నుంచి కొనుగోలు చేశారు. ఎక్కడ సేవించాడు.. తదితర వివరాలన్నింటిని పోలీసులు సేకరిస్తున్నారు.

 

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×