OTT Movie : ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో ఓటీటీ ప్లాట్ ఫామ్ ట్రెండ్ సెట్ చేస్తోంది. సినిమాలకు ధీటుగా, ఈ వెబ్ సిరీస్ లు ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ 16వ శతాబ్దంలో జరుగుతూ ఉంటుంది. ఇందులో కుట్ర కుతంత్రాలతో పాటు రాజరికపు అంశాలన్నీ పొందుపరిచి ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ చివరి వరకు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే ..
జీ 5 (ZEE5) లో
ఈ బాలీవుడ్ వెబ్ సిరీస్ పేరు ‘పౌరాష్‌పూర్’ (Paurashpur). ఇది 2020 డిసెంబర్ 29 నుంచి ALTBalaji, జీ 5 (ZEE5) ప్లాట్ ఫామ్‌లలో ప్రసారం అవుతోంది. ఈ సిరీస్ ఒక చారిత్రక నేపథ్యంలో తెరకెక్కింది. ఇది 16వ శతాబ్దంలోని ఒక పౌరాష్‌పూర్ రాజ్యం చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్‌లో కుట్రలు, రాజకీయాలు, ద్రోహం, కామం, అధికారం వంటి అంశాలు ప్రధానంగా చిత్రీకరించబడ్డాయి. ఇందులో రాజు ఆడవాళ్ళని చాలా వంకర బుద్ధితో చూస్తాడు. కేవలం కోరికలు తీర్చే ఒక ఆట బొమ్మలా వాడుకుంటాడు. దీనిని శచీంద్ర వత్స్ దర్శకత్వం వహించగా, చిన్ మోహితే నిర్మించారు.
స్టోరీలోకి వెళితే
పౌరాష్‌పూర్ రాజ్యాన్ని రాజు ప్రతాప్ సింగ్ పరిపాలిస్తుంటాడు. ఈ రాజు స్త్రీలను కేవలం వాడుకునే వస్తువులుగా భావిస్తాడు. వారిపై కఠినమైన నియమాలు రుద్దుతాడు. ఈ రాజ్యంలో స్త్రీలకు ఎటువంటి స్వేచ్ఛ ఉండదు. స్త్రీలు ఎప్పుడూ పురుషుల ఆధీనంలో బానిసలుగా జీవించాలి. రాజు తన కామ కోరికలను తీర్చుకోవడానికి చాలా మందిని పెళ్లి చేసుకుంటాడు. చివరికి ఈ నీచుడు, తన సొంత కొడుకు భార్యని కూడా వదలడు. ఇతని ఆరాచకాలు ఎదిరించే వాళ్ళు లేక ఇలా సాగిపోతూ ఉంటాయి. అయితే అనుకోకుండా, ఈ రాజు కొత్తగా పెళ్లి చేసుకుంటున్న కొత్త రాణులు రహస్యంగా అదృశ్యమవుతారు. వాళ్ళు ఏమయ్యారో తెలీక రాజు కూడా ఆశ్చర్య పోతాడు. రాజు మొదటి భార్య, రాణి మీరావతి ఈ దుర్మార్గాలను అడ్డుకోవాలని అనుకుంటుంది. నిశ్శబ్దంగా ఇదంతా గమనిస్తూ, తన స్థానాన్ని కాపాడుకోవడానికి తెలివిగా ఇలా చేస్తుంది.
ఇంకోవైపు బోరిస్ అనే ట్రాన్స్‌జెండర్ రాజు చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. బోరిస్ కు ఈ కొత్త రాణుల అదృశ్యం తో ఇతనికి కూడా సంబంధం ఉంటుంది. రాజ్యంలో లింగ వివక్షతను కూడా బోరిస్ ప్రశ్నిస్తాడు. కథ ముందుకు సాగుతున్నప్పుడు, నకాబ్ అనే వ్యక్తి ప్రవేశిస్తాడు. ఈ రాణులను వెతుకుతుంటాడు. ఈ సంఘటనల వెనుక ఉన్న ఉద్దేశాలు, రాజ గృహంలోని కుట్రలు, వ్యక్తిగత ప్రతీకారాలు క్రమంగా ఒక్కొక్కటి బయటపడతాయి. చివరికి, స్త్రీలు, ట్రాన్స్‌జెండర్ లు రాజు దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. వీళ్ళంతా ఈ తిరుగుబాటుపై విజయం సాధిస్తారా ? మహిళలు స్వేచ్చగా బ్రతుకుతారా ? ఈ రాజు లో మార్పు వస్తుందా ? ఈ విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే, ఈ పౌరాష్‌పూర్ వెబ్ సిరీస్ ను చూడండి.