E-Paper
Advertisement

Actress Hema Chaudhary :  హాస్పిటల్లో ప్రముఖ నటి.. ఆందోళనకరంగా ఆరోగ్యం..

Actress Hema Chaudhary :  హాస్పిటల్లో ప్రముఖ నటి.. ఆందోళనకరంగా ఆరోగ్యం..
Advertisement
Actress Hema Chaudhary

Actress Hema Chaudhary : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల పాత్రలతో పాటు చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళకి కూడా మంచి గుర్తింపు వస్తుంది. కొన్ని సందర్భాలలో చేసినవి చిన్న పాత్రలో అయినా.. ఆ ఆర్టిస్టు టాలెంట్ కారణంగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తారు. అలా సౌత్ ఇండియాలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి హేమాచౌదరి. ఆమె ఇప్పటివరకు తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 180కు పైగా చిత్రాలలో నటించి.. తన నటనతో అందరిని మెప్పించారు.

ప్రస్తుతం ఆమె బ్రెయిన్ హేమరేజ్ కారణంగా.. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటమే కాకుండా చికిత్సకు కూడా ఆమె స్పందించడం లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న హేమాచౌదరి ఆరోగ్యం పై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

కన్నడలో రాజ్ కుమార్ ,విష్ణువర్ధన్, రవిచంద్రన్ ,అనంతనాగ్ శంకర్  నాగ్.. లాంటి ప్రముఖ నటులతో హేమాచౌదరి పలు చిత్రాలు చేశారు. ఇటు తెలుగులో కూడా చిరంజీవి ,మోహన్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలలో ఆమె నటించారు. ఆమె కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. తన సినీ కెరీర్లో.. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్‌ పాపులర్‌ స్టార్‌ లాంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు.

1975 నుంచి పలు చిత్రాలలో హేమా చౌదరి నటించారు. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు దుర్గ ప్రభా. విదేశాల నుంచి ఆమె కుమారుడు కూడా ఈరోజు ఇండియా చేరుకోబోతున్నాడు. హేమా చౌదరి ఎక్కువగా కన్నడ చిత్రాల్లో నటించారు. పుట్టింటికి రా చెల్లి ,గోరింటాకు లాంటి చిత్రాలను ఆమె నటన అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. కానీ ఆమె చికిత్సకు కాస్త స్పందించి కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×