BigTV English
Advertisement

Vettaiyan : ‘వేట్టయన్’పై బ్యాన్ డిమాండ్.. వివాదంపై కోర్టు ఏం తేల్చిందంటే?

Vettaiyan : ‘వేట్టయన్’పై బ్యాన్ డిమాండ్.. వివాదంపై కోర్టు ఏం తేల్చిందంటే?

Vettaiyan : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వేట్టయన్’ వివాదంలో చిక్కుకుంది. ఏకంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కోర్టుకెక్కగా, తాజాగా కేసును విచారించిన ధర్మాసనం తీర్పునిచ్చింది. మరి ఇంతకీ ‘వేట్టయన్’ మూవీ వివాదం ఏంటి? కోర్టు ఈ వివాదం పై ఎలా స్పందించింది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


‘వేట్టయన్’ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ 

డైరెక్టర్ టీజే జ్ఞానవెల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వేట్టయన్ : ది హంటర్’. ఇందులో రజనీకాంత్ తో పాటు అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫకత్ ఫాజిల్, అభిరామి, తుషార విజయన్, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో
నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10 న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. రజినీని ఈ సినిమాలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చూపించారు డైరెక్టర్. రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా, సూపర్ స్టార్ అభిమానుల నుంచి దానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. కానీ ఈ ట్రైలర్ సినిమాపై కొత్త వివాదానికి తెరలేపింది.


2021 లో రిలీజ్ అయిన సూర్య బ్లాక్ బస్టర్ మూవీ ‘జై భీమ్’కి కూడా జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అందులో పోలీసుల కస్టడీ వైలెన్స్ ను నెక్స్ట్ లెవెల్ లో చూపించిన డైరెక్టర్ ‘వేట్టయన్’ సినిమాలో మాత్రం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రను ఎందుకు సమర్థిస్తున్నారు? ఇంత హైలెట్ చేస్తున్నారు అంటే ఎన్కౌంటర్ ను సపోర్ట్ చేస్తున్నట్టే అనేది వివాదం. ఎన్కౌంటర్ ను ఇలా హైలెట్ చేయడం, సమర్థించడం కరెక్ట్ కాదంటూ ఈ విషయంపై ఏకంగా కోర్టుకు ఎక్కారు. ‘వేట్టయన్’ సినిమాను నిషేధించాలని కోరుతూ మధురై హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు అయ్యింది. మధురై కి చెందిన పళనివేలు ఈ పిటిషన్ ను దాఖలు చేయగా, ఆయన మాట్లాడుతూ ‘వేట్టయన్’ సినిమాలోని ఎన్కౌంటర్ కు సంబంధించిన కొన్ని పదాలను తొలగించాలని, అవి తొలగించేదాకా సినిమాను రిలీజ్ కాకుండా బ్యాన్ చేయాలని కోరారు. ఈ కేసు అక్టోబర్ 3న ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఎన్కౌంటర్ ను సమర్థిస్తున్నట్టుగా ‘వేట్టయన్ ; ది హంటర్’ సినిమాలో కొన్ని డైలాగులు, సన్నివేశాలు కనిపిస్తున్నాయని, కాబట్టి ఈ సినిమాపై మధ్యంతర నిషేధం విధించాలని వాదించారు.

కోర్టు తీర్పు ఏంటంటే.. 

ఈ కేసు ఈరోజు న్యాయమూర్తులు సుబ్రమణియన్, జస్టిస్ విక్టోరియా గౌరీలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రాగా, వాదనలు విన్న న్యాయమూర్తులు ఈ పిటిషన్‌పై వివరణ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తో పాటు లైకాకు నోటీసులు పంపాలని ఆదేశించారు.  ‘వేట్టయన్’ చిత్రంపై మధ్యంతర నిషేధం విధించేందుకు నిరాకరించారు. అనంతరం కేసు విచారణను న్యాయమూర్తులు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ‘వేట్టయన్’ మూవీని తమిళ టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి, మరి ఈ వివాదానికి నిర్మాతలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×