BigTV English

Vettaiyan: అబ్బబ్బా.. ఏమున్నాడ్రా బాబు రానా.. నెక్స్ట్ లెవెల్ అంతే

Vettaiyan: అబ్బబ్బా.. ఏమున్నాడ్రా బాబు రానా.. నెక్స్ట్ లెవెల్ అంతే

Vettaiyan:  ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న  సినిమాల్లో వెట్టయన్  ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న  ఈ సినిమాకు  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక లోకేష్ సినిమా అంటే.. స్టార్ క్యాస్టింగ్ కంపల్సరీ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వెట్టయన్ లో కూడా లోకేష్ కళ్లు చెదిరే స్టార్ క్యాస్టింగ్ ను దింపాడు.


అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, GM సుందర్, అభిరామి, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ ఇలా   సినిమాలో స్టార్స్ ఉన్నారా.. ? స్టార్స్ తోనే సినిమా చేస్తున్నాడా.. ? అనే అనుమానం వచ్చేలా  స్టార్స్ ను రంగంలోకి దించుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక  ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మనసిలాయో సాంగ్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అనే చెప్పాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ లో రానా దగ్గుబాటి అడుగుపెట్టాడు. తాజాగా రానా మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేస్తూ.. అతని  పాత్రను పరిచయం చేశారు.


Devara: రెడ్ సీ.. ఏం సాంగ్ రా బాబు.. పోవడంలేదు మైండ్ లో నుంచి..

వెట్టయన్ లో రానా.. నటరాజ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మేకింగ్ వీడియోలో రానా లుక్ నెక్స్ట్  లెవల్ లో ఉందని చెప్పాలి.  రానాను ఈ రేంజ్  స్టైలిష్ లుక్ లో చూసి చాలా కాలమయ్యింది. రానా నాయుడు లో కూడా ఇలానే కనిపించాడు కానీ, ఇది దానికి మించి ఉందని చెప్పాలి. చివరి షాట్ లో రజినీని రానా ఇంటర్వ్యూ చేస్తున్నట్లు చూపించారు. అంటే ఇందులో రానా ఒక ఛానెల్ కు హెడ్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రానా క్యారెక్టర్ పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇకపోతే రానా కెరీర్ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ తోనే సాగిపోతుంది.  ఈ సినిమా కాకుండా రానా చేతిలో రానా నాయుడు 2 ఉంది. గతంలో ఎప్పుడో నేనే రాజు నేనే మంత్రి 2 మొదలవుతుంది అన్నారు.. అది లేదు. హిరణ్య కశిప వస్తుంది అన్నారు.. అది కూడా ముగిసిపోయిందని వార్తలు వస్తున్నాయి. అందుకే  రానా ఎక్కువ నిర్మాణ రంగంలో  ఫోకస్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ సినిమాతో కనుక రానా హిట్ అందుకుంటే.. హీరోగా మళ్లీ   బిజీ  అవుతాడేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×