BigTV English

Devara: రెడ్ సీ.. ఏం సాంగ్ రా బాబు.. పోవడంలేదు మైండ్ లో నుంచి..

Devara: రెడ్ సీ.. ఏం సాంగ్ రా బాబు.. పోవడంలేదు మైండ్ లో నుంచి..

Devara:  ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపిస్తున్నాడు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  సెప్టెంబర్ 27 న ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు రానుంది.


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన ఎన్టీఆర్.. వరుసగా ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. ఇంకోపక్క మేకర్స్.. దేవర స్టిల్స్,  ఆడియో సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ మరింత హైప్ తీసుకొస్తున్నారు.  దేవర నుంచి వచ్చిన ప్రతి సాంగ్ ప్రేక్షకులను మెప్పించింది, ఫియర్ సాంగ్, చుట్టమల్లే, దావుదీ.. ఈ మూడు కూడా  చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

ఇక ఈ మూడు కాకుండా రెడ్ సీ(Red Sea) అంటూ సాగే సాంగ్ ను ఈ మధ్యనే  స్ఫోటిఫై లో రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఇదొక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లా అనిపిస్తుంది. ఈ మ్యూజిక్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ సాంగ్ ను థియేటర్ లో చూస్తే పూనకాలే అంటూ చెప్పుకొచ్చారు.


ఇక ఇప్పుడు అదే సాంగ్ ను మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అనిరుధ్ మ్యూజిక్ తో పిచ్చెక్కించాడు. హైసెన్‌బర్గ్ లిరిక్స్ అందించగా..  వోకల్స్ అనిరుధ్ అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×