BigTV English

Vettaiyan : రజినీ సినిమాకు హాలిడేస్ ఇచ్చిన కంపెనీలు… కానీ భలే దెబ్బ పడింది

Vettaiyan : రజినీ సినిమాకు హాలిడేస్ ఇచ్చిన కంపెనీలు… కానీ భలే దెబ్బ పడింది

Vettaiyan : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఇండియాలోనే కాదు దేశ విదేశాల్లో సైతం భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల క్రితమే తన స్టైల్, స్వాగ్ తో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన. ఇక ఇప్పుడు ఏడు పదుల వయసు దాటినా ఏమాత్రం జోరు తగ్గకుండా సినిమాలు చేస్తూ తన మార్క్ నటన, మేనేజంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం వదలలేదు రజనీకాంత్. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నా రజిని స్టైల్ కు సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఆయన ఫ్యాన్ బేస్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాలంటే.. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు కొన్ని కంపెనీలు సెలవులు ప్రకటిస్తాయి. తాజాగా మరోసారి ‘వేట్టయాన్‘ సినిమా రిలీజ్ విషయంలో కూడా ఇదే జరిగింది.


రజినీ అభిమానులకు పెయిడ్ హాలిడేస్

రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే పలు సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఎంప్లాయిస్ కి పెయిడ్ హాలిడేస్ ప్రకటించడం అన్నది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల కాలంలో కొన్ని సినిమాలకు ఆ ఆనవాయితీని తప్పినప్పటికీ తాజాగా మరోసారి ‘వేట్టయాన్‘ సినిమాతో మొదలు పెట్టారు. ‘వేట్టయాన్’ ఫీవర్ పలు కంపెనీలకు పాకడంతో సూపర్ స్టార్ సినిమా రిలీజ్ సందర్భంగా ఏకంగా తమ కంపెనీలకు రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు పెయిడ్ హాలిడేస్ ప్రకటిస్తూ అఫీషియల్ గా ఆ విషయాన్ని అనౌన్స్ చేశాయి. దీంతో తలైవా మూవీ అంటే ఈ రేంజ్ ఉంటుంది అంటూ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కానీ ఈ పెయిడ్ హాలిడేస్ వల్ల పెద్దగా లాభం లేదు అనిపిస్తోంది. ప్రస్తుతం సినిమాకు దారుణంగా నెగిటివ్ టాక్ వస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా చాలామంది మూవీ లవర్స్ రజనీకాంత్ సినిమాలకు అప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేడు అని అంటున్నారు.


‘వేట్టయాన్’సినిమాకు నెగిటివ్ టాక్…

రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవెల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట్టయాన్‘ సినిమా తెల్లవారుజామున 4 గంటలకే స్పెషల్ ప్రీమియర్ పడింది. రిలీజ్ కి ముందే టైటిల్ వివాదం కారణంగా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను చూసిన రజిని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సినిమా ఎలా ఉందో కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అనుకున్నట్టుగానే ఆకట్టుకునే రేంజ్ లో లేదని టాక్ నడుస్తోంది. సినిమాలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్,  ఫహాద్ ఫాజిల్ తదితర స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ వారి స్క్రీన్ ప్రజెన్స్ సినిమాను ఏమాత్రం కాపాడలేదు అనే టాక్ నడుస్తోంది. అలాగే ఇప్పటికే వచ్చిన రివ్యూలు సైతం ఇదే చెబుతున్నాయి. ఇదంతా దృష్టిలో పెట్టుకొని చూస్తే ‘వేట్టయాన్‘ సినిమాకు కంపెనీలు హాలిడేస్ ఇచ్చినా ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు కొంతమంది మూవీ లవర్స్. ఏదైతేనేం ఈ రకంగా రజినీ ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ హాలీ డే దొరకడం సంతోషించాల్సిన విషయం.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×