Venkatesh: ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ (Daggubati Venkatesh) ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అసలు ఈ రేంజ్ హిట్ కొడతానని వెంకీ కూడా ఊహించలేదేమో. టాలీవుడ్ చరిత్రలోనే ఒక రీజనల్ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. అలాగే యాక్షన్ మరియు కామెడీ అంశాలతో కూడిన కథనంతో రూపొందించబడింది. వెంకటేష్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనింగ్ ఈ చిత్రానికి బలం చేకూర్చాయి. దీంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 300 కోట్ల వసూళ్లతో భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో వెంకటేష్ సోలోగా 300 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఇది టాలీవుడ్‌లోనే కాదు.. వెంకటేశ్ కెరీర్లోను బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. దీంతో వెంకటేష్ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. వెంకీ మాత్రం ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
హరీష్ శంకర్‌తో ఫిక్స్?
ఎలాగైనా సరే సంక్రాంతికి వస్తున్నాం హిట్‌ను కొనసాగలని భావిస్తున్న వెంకటేష్.. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో కథలు విన్నాడట. అయినా కూడా ఏది నచ్చ లేదట. ఫైనల్‌గా.. సామజవరగమన రచయితల్లో ఒకరైన నందు అనే రచయిత రాసిన కామెడీ బేస్డ్ కథ ఆయనకు నచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నందుకు అనుభవం తక్కువ కావడంతో కేవలం కథను మాత్రమే తీసుకొని.. దర్శకుడిగా హరీష్ శంకర్‌ను (Harish Shankar) ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. చివరగా హరీష్ శంకర్ తెరకకెక్కించిన “మిస్టర్ బచ్చన్” ప్లాప్ అయినప్పటికీ హరీష్ టేకింగ్ మీద వెంకటేశ్ గట్టి నమ్మకంతో ఉన్నాడట. హరీష్ శంకర్‌కు మంచి కథ దొరికితే సినిమాను అద్భుతంగా తీయగల సామర్థ్యం ఉంది. గతంలో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలతో అదరగొట్టాడు హరీశ్. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా సెట్స్ పై ఉంది. కానీ పవన్ డేట్స్ అడ్జెట్ కాలేకపోవడంతో.. ఉస్తాద్‌కు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లో వెంకటేశ్‌తో సినిమా తీయాలని హరీష్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందని టాక్.
వెంకీ రిస్క్ చేస్తున్నాడా?
హరీష్ శంకర్ సినిమాలు తీసుకుంటే.. షాక్ నుంచి మొదలుకొని మిస్టర్ బచ్చన్ వరకు.. రీమేక్ సినిమాలే ఎక్కువగా హిట్ అయ్యాయి. మిరపకాయ్, డీజే తప్పితే.. స్ట్రెయిట్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గబ్బర్ సింగ్
హరీష్ శంకర్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం, హిందీ సినిమా “దబంగ్” రీమేక్‌గా రూపొందింది. హరీష్ ఈ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు అద్భుతంగా మలిచాడు. ఆ తర్వాత రామయ్య వస్తావయ్య ఫ్లాప్ కాగా.. డీజే: దువ్వాడ జగన్నాధం హిట్ అయింది. కానీ హిందీ సినిమా “రైడ్” ఆధారంగా రూపొందిన మిస్టర్ బచ్చన్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. మరి రీమేక్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హరీష్ శంకర్.. వెంకటేష్‌తో స్ట్రెయిట్ సినిమాతో హిట్ కొడతాడా? అనే చర్చ జరుగుతోంది. కానీ హరీష్ సినిమాల్లో హీరో ఎలివేషన్ సీన్స్, పవర్‌ఫుల్ డైలాగ్‌లు మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటాయి. మరి వెంకీతో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.