BigTV English

KomatiReddy Rajagopal Reddy : పట్టుబట్టి.. పంతంపట్టి.. ఓడి నెగ్గిన రాజగోపాల్‌రెడ్డి

KomatiReddy Rajagopal Reddy : పట్టుబట్టి.. పంతంపట్టి.. ఓడి నెగ్గిన రాజగోపాల్‌రెడ్డి

KomatiReddy Rajagopal Reddy : కంగ్రాట్స్ మినిస్టర్ గారు అంటూ అసెంబ్లీలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు కేటీఆర్. ఇంకా ఫైనల్ కాలేదు అంటూ ముసిముసి నవ్వులు నవ్వారు కోమటిరెడ్డి. తెలంగాణ కేబినెట్ విస్తరణ అనే టాక్ మొదలైనప్పటి నుంచీ వినిపిస్తు్న్న పేరు ఆయనదే. శాఖ కూడా డిసైడ్ చేసేశారు. తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని స్వయంగా రాజగోపాలే లీకులు ఇచ్చారు. ప్రస్తుతం ఆ శాఖ సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి తర్వాత నెంబర్ 2 పొజిషన్‌ హోంమంత్రే. అందుకే, ఫైర్‌బ్రాండ్ లీడర్.. ఆ పవర్‌ఫుల్ పోస్టును కోరుకుంటున్నట్టున్నారు.


రేసులో ఆ ఆరుగురు..

కేబినెట్‌లోకి వివేక్ వెంకటస్వామి, సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, అద్దంకి దయాకర్, ప్రేమ్‌సాగర్‌రావు, విజయశాంతి, అమీర్ అలీఖాన్ ఇలా పలువురి పేర్లు టాప్‌లో ఉన్నాయి. లేటెస్ట్‌గా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఢిల్లీ వెళ్లి తనకు మంత్రిపదవి కావాలని అడుగుతున్నారు.


ఓడి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి.. మార్పు మంచిదే..

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. 2009లో భువనగిరి ఎంపీగా, రెండుసార్లు మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన బలమైన నాయకుడు. మధ్యలో 2022లో మునుగోడు ఉప ఎన్నికతో ఆయన పేరు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకూ దద్దరిల్లింది. బీజేపీ గుర్తుపై పోటీ చేసి సిట్టింగ్ సీటులో ఓడిపోయారు. తప్పు సరి చేసుకుని.. మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకుని జయకేతనం ఎగరవేశాడు. ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు హస్తం హైకమాండ్ గట్టి ప్రయత్నమే చేసింది. సునీల్ కనుగోలు సర్వేలో మునుగోడులో రాజగోపాల్‌రెడ్డినే మొనగాడని తేలడంతో.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రిపదవి ఇస్తామనే హామీతో ఆయన్ను పార్టీలో చేర్చుకుని మునుగోడు టికెట్ ఇచ్చింది. గెలిచి చూపించి.. ఇప్పుడు కేబినెట్ రేసులో ముందున్నారు రాజగోపాల్.

నల్గొండ జిల్లా.. కోమటిరెడ్డి ఖిల్లా..

కోమటిరెడ్డి బ్రదర్స్. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. నల్గొండ కాంగ్రెస్ ఖిల్లా. కోమటిరెడ్డి కుటుంబం అడ్డా. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అంతా హేమాహేమీలే. అందుకే, కుటుంబానికి ఒకే పదవి అనే నిర్ణయాన్ని పక్కనపెట్టి మరీ.. ఇప్పటికే వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉన్నా కూడా.. ఆయన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికీ కేబినెట్‌ కిరీటం కట్టబెట్టేందుకు హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

రిచెస్ట్ లీడర్.. మాస్ మహారాజ్..

రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్. దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ పనులు చేస్తుంది ఈ కంపెనీ. వందల కోట్ల ఆస్తులు. ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నేతల్లో ఒకరు. ఎలక్షన్ అఫిడవిట్‌లోనే సుమారు 500 కోట్ల ఆస్తులు చూపించారు. సంపాదనే కాదు.. చారిటీలోనూ ముందుంటారు. చేతికి ఎముకే లేదన్నట్టు సాయం చేస్తుంటారు. మునుగోడు ప్రజలకు ఏ కష్టం ఉన్నా నేనున్నానంటూ ఆదుకుంటారు. పెళ్లైనా, చావైనా.. ఆర్థిక సాయం చేస్తుంటారు. పనులే కాదు.. మాటలు సైతం వాడివేడిగా ఉంటాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఫైర్‌బ్రాండ్ లీడర్సే. కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులే. అలాంటి బ్రదర్స్ ఒకేసారి.. ఒకే కేబినెట్‌లో ఉండబోతున్నారనే న్యూస్.. పొలిటికల్‌గా ఇంట్రెస్టింగ్. ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబం సంగతి చూస్తానంటూ సవాళ్లు చేస్తున్న రాజగోపాల్‌రెడ్డికి.. అనుకున్నట్టుగానే హోంమంత్రి పదవి ఇస్తే..? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు కష్టకాలమేనా..? వారి ఖేల్ ఖతమేనా..?

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×