BigTV English

Samantha: సక్సెస్ అంటే విజయం కాదు.. ఏం కోల్పోయానో అప్పుడే తెలిసింది అంటున్న సమంత..?

Samantha: సక్సెస్ అంటే విజయం కాదు.. ఏం కోల్పోయానో అప్పుడే తెలిసింది అంటున్న సమంత..?

Samantha.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సొంతం చేసుకున్న సమంత (Samantha), ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లలో చేస్తూ బిజీగా మారిపోయింది. అక్కడ చివరిగా ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత.. గత కొన్ని రోజులుగా సిడ్నీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఇటీవల జరిగిన ‘ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీ’లో ఆమె పాల్గొన్నారు. కెరియర్ రాణించడం పై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ .. అన్నింటినీ ధైర్యంగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వచ్చాను అంటూ తెలిపారు. అంతేకాదు ఇదే ఈవెంట్లో సక్సెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కాకుండా సక్సెస్ కి పర్యాయపదం ఏంటో వివరించారు. సక్సెస్ అంటే విజయాలు సాధించడం మాత్రమే కాదని కట్టుబాట్లు, సామాజిక పట్టింపుల నుండి విముక్తి పొందడమే అని, స్వేచ్ఛగా జీవించడం, మూస ధోరణి భావనలను సవాలు చేయడం గురించి ఆమె హైలెట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు సక్సెస్ గురించి ఈమె చేసిన కామెంట్లకు ప్రతి ఒక్కరు ఈమెపై ప్రశంసలు కురిపిస్తూ.. తాము తమ జీవితంలో ఏం కోల్పోయాము అనే విషయంపై కూడా ఆలోచించడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.


Betting Apps Case: హైకోర్టులో విష్ణు ప్రియకి చుక్కెదురు.. స్టే నిరాకరణ.!

స్వేచ్ఛగా జీవించడమే అసలైన సక్సెస్ – సమంత


ఇక వేదికపై సమంత మాట్లాడుతూ.. “నా దృష్టిలో సక్సెస్ అంటే విజయాలు సొంతం చేసుకోవడం కాదు.. సక్సెస్ అంటే స్వేచ్ఛ , స్వతంత్రం. నేను విజయవంతం అయ్యానని ఇతరులు చెప్పే వరకు కూడా నేను వేచి ఉండను. సక్సెస్ అంటే మనకు నచ్చినట్టుగా మనం జీవించడమే.మన అభివృద్ధికి తగ్గట్టుగా పనులు చేయడం. అంతేకానీ మహిళలను ఒకచోట బంధించి, ఇలా చేయాలి.. అలా చేయకూడదు అని చెప్పడం కాదు.నిజజీవితంలో కూడా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ అన్నింటిలోనూ సమర్థవంతంగా రాణించగలగడమే సక్సెస్ అంటే” అంటూ సమంత తెలిపింది. మొత్తానికి అయితే సమంత చేసిన ఈ కామెంట్లు ఇండైరెక్టుగా వైవాహిక బంధం గురించి కామెంట్లు చేసిందని కూడా కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అక్కడ స్వేచ్ఛ కల్పించలేదు. కాబట్టే కట్టుబాట్లను తెంచేసుకొని, నేడు స్వేచ్ఛగా జీవితాన్ని కొనసాగిస్తోందని, ఆమె ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సమంత కెరియర్..

ఇక సమంత విషయానికి వస్తే..’ట్రాలాలా’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తన నిర్మాణ సంస్థలో నిర్మించే సినిమాల కోసం పనిచేసే నటీనటులకు మగ ఆడ అని తేడా లేకుండా అందరికీ సమానంగా పారితోషకం ఇస్తానని చెప్పి, ఇండస్ట్రీలో లింగ వివక్షతకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది సమంత. ఇక ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఈ సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వదలలేదు. ఇక మరొకవైపు హిందీలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ లో కూడా ఒకవైపు సినిమాలు, మరొకవైపు వెబ్ సిరీస్ లు అంటూ బిజీ బిజీగా గడిపేస్తోంది సమంత.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×