E-Paper
Advertisement

Vidaamuyarchi first look Released: అజిత్ కుమార్ “విడాముయర్చి” ఫస్ట్ లుక్ విడుదల.. ఎలా ఉందంటే?

Vidaamuyarchi first look Released: అజిత్ కుమార్ “విడాముయర్చి” ఫస్ట్ లుక్ విడుదల.. ఎలా ఉందంటే?
Advertisement

Vidaamuyarchi first look poster(Film news in telugu today): అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో రూపొందుతున్న భారీ మూవీ ‘విడాముయర్చి’. ఈ క్రేజీ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. అసలు ఈ మూవీలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది..? సినిమా ఎలా ఆకట్టుకోనుందంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఆ సమయం వచ్చేసింది.. అందరి అంచనాలను మించేలా ‘విడాముయర్చి’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.

అయితే, ‘విడాముయర్చి’ మూవీ ప్రారంభం నుంచి కోలివుడ్ సహా అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ తో భారీ బడ్జెట్ చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తున్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్.. ‘విడాముయర్చి’ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నమగిళ్ కు ఆకట్టుకునే ఎంటర్ టైన్మెంట్ చిత్రాలతోపాటు విలక్షణమైన చిత్రాలు తీస్తాడు అనే పేరు ఉంది.

Advertisement

అజిత్ కెరీర్ లో వన్ ఆప్ ది బ్లాక్ బస్టర్ సినిమా ‘మంగాత’లో అజిత్ కుమార్, త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇంకా ఈ సినిమాలో ఆరవ్, నిఖిల్, రెజీనా కసాండ్రతో పాటు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ్ కుమరన్ మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘విడాముయర్చి’ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇప్పుడు విడుదల చేయడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అజిత్ తో సినిమా చేస్తున్నామని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు, సినీ ప్రేక్షకులు వారి సపోర్ట్ ను మాకు అందిస్తున్నారు. వారికి చక్కటి సినిమాను అందించటమే మా లక్ష్యం. ఈ సినిమా కోసం మా టీమ్ ఎంతగానో కష్టపడుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా ముందుకుసాగుతోంది. ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తాం. ఆ తరువాత సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయాన్ని అధికారికంగా తెలియజేస్తాం’ అంటూ కుమరన్ పేర్కొన్నారు.

Advertisement

Also Read: పుంజుకున్న కలెక్షన్స్.. బాక్సాఫీసు వద్ద ‘కల్కి’ వీర బాదుడు.. మూడు రోజుల్లో ఎంతంటే?

ఓం ప్రకాశ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఎన్బీ శ్రీకాంత్ ఎడిటర్ గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. అను వర్ధన్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×