BigTV English

Kingdom: కింగ్ డమ్ కి తప్పని రీషూట్ కష్టాలు.. రిలీజ్ అవుతుందా ?

Kingdom: కింగ్ డమ్ కి తప్పని రీషూట్ కష్టాలు.. రిలీజ్ అవుతుందా ?

Kingdom: రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఎన్నాళ్లగానో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు విజయ్ బౌన్స్ బ్యాక్ అవుతాడు. దాని కోసం ఈ కుర్ర హీరో చేయని ప్రయోగాలు లేవు. లైగర్ ప్లాప్ విజయ్  ను ఎంతగా కిందకు తోసేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని నుంచి బయటపడడానికి  ఈ కుర్ర హీరో చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే విజయ్.. తన కొత్త చిత్రం కింగ్డమ్ పై చాలా శ్రద్ద పెడుతున్నాడు. అవుట్ ఫుట్ అందరికి నచ్చేవరకు అస్సలు వదలడం లేదు అని టాక్ నడుస్తోంది.


 

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా  మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సివుండగా దేశంలో ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్స్ చేయడం, ఈవెంట్స్ నిర్వహించడం కష్టమని భావించి  జూలై 4 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


 

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా రీషూట్ కష్టాలను ఎదుర్కొంటుందని టాక్ నడుస్తోంది. సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకోగా..  చివర్లో కొన్ని సన్నివేశాలు అంత బాగా రాలేదని,   వచ్చిన అవుట్ ఫుట్ వలన మేకర్స్ సంతృప్తిగా లేరని సమాచారం. ఇక చిత్ర బృందం సైతం ఆ అవుట్ ఫుట్ ను అలానే ఉంచేయడం నచ్చక.. మరోసారి రీషూట్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. గోవాలో తీసిన కొన్ని సీన్స్ ను మళ్లీ రీషూట్ చేస్తున్నారని, దీనికోసం విజయ్ గోవా వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

 

సరిగ్గా నెల లో రిలీజ్ పెట్టుకొని.. ఇంకా రీషూట్స్ అని తిరిగితే.. ప్రమోషన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది అనేది కొందరి వాదన. కానీ, అవుట్ ఫుట్ మంచిగా రావాలని, ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వడం కోసం ఎంతైనా కష్టపడక తప్పదు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ప్రమోషన్స్ చేసే సమయంలో ఇలా రీషూట్ అంటే.. సమయం వృధా అవ్వడమే అని చెప్పొచ్చు. విజయ్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని రాష్ట్రాలు తిరగలి. ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇవన్నీ నెలలో అయ్యే పని కాదు. ఈ రీషూట్ ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలియదు. ఇలా గందరగోళంలో ఉన్న కింగ్డమ్.. రిలీజ్ డేట్ కు అంతా చక్కబరుస్తుందా.. ? లేక రిలీజ్ నే ఇంకోసారి వాయిదా వేస్తుందా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×