BigTV English
Advertisement

Stomach Pain:  కడుపునొప్పే కదా అని పట్టించుకోవడం లేదా?  కాలేయ క్యాన్సర్ కూడా కావచ్చు, ఈ సంకేతాలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

Stomach Pain:  కడుపునొప్పే కదా అని పట్టించుకోవడం లేదా?  కాలేయ క్యాన్సర్ కూడా కావచ్చు, ఈ సంకేతాలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

కాలేయం పొట్టకు పక్కనే ఉంటుంది. అందుకే నొప్పి ఆ భాగంలో వస్తే చాలా మంది పొట్టనొప్పి అనే అనుకుంటారు. నిజానికి పొట్టనొప్పి వస్తున్నా కూడా తేలికగా తీసుకోకూడదు. తరచూ కడుపు నొప్పి వస్తున్నప్పుడు… అది ఎందుకు వస్తుందో వైద్యులను కలిసి తగిన రోగనిర్ధారణ చేసుకోవడం ముఖ్యం, ఎందుకంటే ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలకు కూడా కడుపునొప్పి మొదటి సంకేతంగా మారుతుంది.


పొట్టనొప్పి వస్తున్నా పట్టించుకోకుండా ఆ క్షణానికి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని గడిపేస్తున్న వారు ఎంతోమంది. అలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాలేయ క్యాన్సర్ కి కూడా కడుపునొప్పి ఒక లక్షణమే. కాలేయ క్యాన్సర్ వస్తే బరువు త్వరగా తగ్గిపోతారు. దేని పైనా శ్రద్ధ చూపించలేరు. ఏకాగ్రత కుదరదు. ఆకలి కూడా చాలా తక్కువగా ఉంటుంది. పొట్ట త్వరగా నిండిపోయినట్టు అనిపిస్తుంది.

అంతేకాదు కాలేయ క్యాన్సర్ తో బాధపడే వారిలో పొట్ట నొప్పి తరచూ ఉంటుంది. ఏది తిన్నా ఇబ్బందిగా ఉంటుంది. నిత్యం అసౌకర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా పొట్టకు కుడి భాగంలో ఆ నొప్పి అసౌకర్యం తెలుస్తుంది. ఎందుకంటే కాలేయం ఈ ప్రదేశంలోనే ఉంటుంది. అలాగే కాలేయంపై క్యాన్సర్ కణితి పెరగడం మొదలైతే ఇలా నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి మీకు పొట్ట నొప్పి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలిసి అది ఎందుకు వస్తుందో తెలుసుకోండి.


కాలేయ క్యాన్సర్ లక్షణాలు

కాలేయం సరిగా పనిచేస్తేనే మనకు ఆకలి సరైన సమయానికి వేస్తుంది. లేకపోతే ఆకలి ఏర్పడదు. దీని వల్ల పొట్ట కూడా ఉబ్బినట్టు అవుతుంది. ఆహారం చూసినా కూడా తినాలనిపించదు. కామెర్లు రావడం కూడా కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాలేయం సరిగా పనిచేయలేకపోయినా కామెర్లు వస్తాయి. కాలేయం సరిగా పనిచేయకపోవడం ఏ కారణం క్యాన్సర్ కణితి కూడా కావచ్చు. ఆ కణితి పెరిగి పొట్ట నాళాన్ని అడ్డుకోవచ్చు. అలాంటి సమయంలో కూడా కాలేయం సరిగా పని చేయదు. కాబట్టి మీకు పచ్చకామెర్లు వచ్చినా దానికి కారణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

కేవలం పొట్టనొప్పి మాత్రమే కాదు కాలేయ క్యాన్సర్ తో ముడిపడిన సంకేతాలు, లక్షణాలు ఎన్నో ఉన్నాయి. గుండెల్లో మంటగా అనిపించడం, రాత్రుళ్ళు ఎక్కువగా చమట పట్టడం, గొంతు ముక్కు నుంచి రక్తం రావడం, ఊపిరి ఆడనట్టు అవ్వడం, దగ్గు ఎన్ని మందులు వాడినా తగ్గకుండా వస్తూనే ఉండడం, ఆకలి వేయకపోవడం, ఆహారం మింగుతుంటే ఇబ్బంది పడడం, వాంతులు అవుతున్నప్పుడు రక్తం కనిపించడం వంటివన్నీ కూడా కాలేయ క్యాన్సర్ లక్షణాలే.

కాలేయ క్యాన్సర్ వచ్చిన వ్యక్తుల్లో జీవించే రేటు చాలా వరకు తగ్గిపోతుంది. వీరు ఐదేళ్ల పాటు జీవించే అవకాశం ఉంటుంది. కాలేయ క్యాన్సర్ పక్కనే ఉన్న అవయవాలు లేదా శోషరస కణుపులకు కూడా వ్యాపిస్తే వారి మనుగడ రేటు ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

కాలేయ క్యాన్సర్ వచ్చినవారికి శస్త్ర చికిత్స, రేడియేషన్ థెరఫీ, కీమోథెరపీ వంటి ఎన్నో విధానాలను పాటిస్తారు. అయితే రోగ నిర్ధారణ క్యాన్సర్ దశనుబట్టి ఈ చికిత్స పద్ధతులు ఆధారపడి ఉంటాయి. ఒక్కొక్కసారి కాలేయ మార్పిడి కూడా అవసరం పడుతుంది. క్యాన్సర్ వల్ల కాలేయం పూర్తిగా పాడైనప్పుడు ఇలా జరుగుతుంది. అదే కాలేయ క్యాన్సర్ పక్కనున్న అవయవాలకు కూడా వ్యాపిస్తే కీమోథెరపీ చేస్తారు. కాలేయ కణాలను తగ్గించడానికి లేదా నాశనం చేయడానికి ఈ రేడియేషన్ తరపున ఇస్తారు. ఈ సమయంలో ఎన్నో సైడ్ ఎఫెక్టులు కూడా ఉంటాయి.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×