Kingdom Release Date : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్.. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, ఇప్పుడు కథల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకున్నాడు విజయ్.. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఆయన చేసిన గత సినిమాల కంటే దీని మీదనే ఎక్కువ హైప్ ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న విజయ్ ఈ మూవీని కరెక్ట్ టైం లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మే నెలలో రిలీజ్ చేయాలని మొదటగా భావించినా కూడా కొన్ని కారణాలతో మరోసారి డేట్ ను మార్చుకున్నారు. తాజాగా ఈ మూవీ ని జూలై 4న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న కన్ఫామ్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొత్తానికి విజయ్ దేవరకొండ సినిమాకి రూట్ క్లియర్ అయ్యిందని తెలుస్తుంది.
కింగ్ డమ్ రిలీజ్ డేట్ లాక్..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఖాతాలో గత కున్నేలుగా సక్సెస్ సినిమా పడలేదు. గతంలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాపై ప్రేక్షకులు పెదవిరిచారు. దాంతో సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. ఆ తర్వాత కల్కి సినిమాలో కీలక పాత్రలో నటించాడు విజయ్ దేవరకొండ.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో విజయ్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.. ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ మూవీలో నటినస్తున్నాడు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం మొదటగా మే 30న విడుదల కావాల్సి ఉంది.. అయితే,మే 30న విడుదల కావాల్సిన మా ‘కింగ్‌డమ్’ సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. అందుకే సినిమాను పోస్ట్ పోన్ చేశారు.
Also Read : ఓవర్సీస్ లో ‘సింగిల్’ ర్యాంపేజ్.. మరో రికార్డు బ్రేక్..
మాట నిలబెట్టుకున్న నాగ వంశీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అయిన విషయం తెలిసిందే. దాంతో మిగిలిన సినిమాలు ఏవి కూడా పవన్ కళ్యాణ్ కి పోటీగా ఉండకుండా తమ రిలీజ్ డేట్ ని మార్చుకుంటూ వస్తున్నాయి.. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ కూడా డేట్ ను మార్చుకుంది. హరి హర వీరమల్లు కూడా మే 30 రిలీజ్ డేట్ అని అనుకున్నారు. కానీ, జూన్ 13న ఫిక్స్ చేసేలా ఉన్నారు. అంటే పవన్ మూవీ కి 3 వారాల టైం ఇచ్చారు నిర్మాత నాగ వంశీ..మే 30 అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టైంలోనే నాగ వంశీ చెప్పాడు. ఒక వేళ పవన్ మూవీ వస్తే విజయ్ మూవీని వాయిదా వేసుకుంటామని చెప్పారు. అన్నమాట ప్రకారం నాగవంశీ ఈ సినిమాని మే నుంచి జూలైకి షిఫ్ట్ చేసుకున్నారు.. ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..
Kingdom New Date
Release on 4th June 2025 #KINGDOM #VijayDeverakonda #BigtvCiema @TheDeverakonda pic.twitter.com/P6DivUKtmo— BIG TV Cinema (@BigtvCinema) May 14, 2025