BigTV English

Colonel Sophia Qureshi: ఆమె ఉగ్రవాదుల సోదరి.. కల్నల్ సోఫియాపై బిజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Colonel Sophia Qureshi: ఆమె ఉగ్రవాదుల సోదరి.. కల్నల్ సోఫియాపై బిజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Colonel Sophia Qureshi| పాకిస్తాన్ పై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యలో కల్నల్ సోఫియా ఖురేషి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ వైమానిక దాడులు చేసి ధ్వంసం చేసింది. ఆ వివరాలను కల్నల్ సోఫియా ఖురేషి మీడియా ముందుకు వివరిస్తూ వచ్చారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఒక మంత్రి ఆమె మతంపై వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఆమె ఉగ్రవాదుల మతానికి చెందిన వారని.. వారి సోదరి చెప్పాడు. ఈ వ్యాఖ్యలు చేసింది.. మధ్యప్రదేశ్ లో గిరిజన సంక్షేమ మంత్రి కువర్ విజయ్ షా.


మంగళవారం ఇందోర్ నగరం సమీపంలోని ఓ గ్రామంలో మంత్రి విజయ్ షా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. “ఆ ఉగ్రవాదులు మన సోదరిమణుల సిందూరాన్ని తుడిచి వేశారు. వారిని వితంతువులుగా చేవారు. కానీ మన ప్రధాని మోదీ మాత్రం వారి మతానికి చెందిన సోదరినే విమానంలో పంపించి వారి బట్టలు ఊడదీశారు. ఇది వారికి గుర్తుండి పోయే పాఠం. మారు మన సమాజానికి (మతానికి) చెందిన వారి మహిళలను హాని కలిగిస్తే.. మేము వారి సోదరి చేతనే వారి బట్టలు ఊడదీశాం.” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో వారి సోదరి అని కల్నల్ సోఫియా ఖరేషిని ఉద్దేశించి అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.

కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మంత్రి విజయ్ షాపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు కించపరిచేవిగా ఉన్నాయని, ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు.


క్షమాపణలు చెప్పిన బిజేపీ మంత్రి

మరోవైపు మధ్యప్రదేశ్ బిజేపీ నాయకత్వం కూడా ఈ విషయంలో మంత్రి విజయ్ షాకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే మంత్రి విజయ్ షా వెంటనే మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కోరారు. ఉగ్రవాదుల దుశ్చర్యల వల్ల తన మనసు కలత చెంది అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు విజయ్ షా విలేకరులతో అన్నారు. కులమతాలకు అతీతంగా కల్నల్ సోఫియా ఖురేషీ చేసిన దేశ సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నానని, కలలో కూడా ఆమెను కించపరిచే ఆలోచన తనకు రాదని ఆయన స్పష్టం చేశారు. తన మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే, పదిసార్లు క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

Also Read: సింధు జలాలపై ఆంక్షలు కొనసాగితే యుద్ధం మళ్లీ ప్రారంభం కావొచ్చు.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

కల్నల్ సోఫియా ఇల్లుని ఆర్ఎస్ఎస్ వర్కర్లు ధ్వంసం చేశారా?
మరోవైపు సోషల్ మీడియాలో కల్నల్ సోఫియాకు చెందిన కర్ణాటకలోని ఇంటిపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని సోషల్ మీడియా ‘ఎక్స్’ ప్లాట్ ఫామ్‌పై ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలిసి కర్టాటక పోలీసులు వెంటనే బెలగావిలో ని కల్నల్ సోఫియా కుటుంబ నివాసానికి వెళ్లారు. కానీ అక్కడ అంతా సామాన్యంగా ఉన్నట్లు గుర్తించి..సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేసిన ఆ అకౌంట్ పై ఆరా తీశారు. ఆ అకౌంట్ ఒక పాకిస్తానీ యూజర్ ది అని తేలిడంతో ఆ అకౌంట్ ని బ్లాక్ చేయిస్తామని మీడియాకు తెలిపారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×