BigTV English

Single Movie: ఓవర్సీస్ లో ‘సింగిల్’ ర్యాంపేజ్.. మరో రికార్డు బ్రేక్..

Single Movie: ఓవర్సీస్ లో ‘సింగిల్’ ర్యాంపేజ్.. మరో రికార్డు బ్రేక్..

Single Collections : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, కేతిక శర్మ,ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్.. కామెడీ ఏంటర్టైనర్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. యంగ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి కలిసి నిర్మించారు. రిలీజ్ కు ముందు అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే కలెక్షన్స్ ని వసూల్ చెయ్యడంతో విష్ణు ఖాతాలో మరో హిట్ మూవీ పడింది.. మొదటి రోజు నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా. ఇండియాలోనే కాదు.. అటు అమెరికాలో కూడా దున్నెస్తుంది. ఓవర్సీస్ లో పాజిటివ్ టాక్ తో పాటు కలెక్షన్లు కూడా భారీగానే పెరుగుతున్నాయి.. మరి ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ ని రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం…


ఓవర్సీస్ లో ‘సింగిల్ ‘ కలెక్షన్స్.. 

ఈమధ్య హీరో శ్రీ విష్ణు నటిస్తున్న ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి క్రేజ్ ను అందుకుంటున్నాయి.. ఓం భీమ్ బుష్ సినిమా కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. గత ఏడాది స్వాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శ్రీవిష్ణు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. ఈ ఏడాది మాత్రం సింగిల్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన శ్రీ విష్ణు ఈ మూవీ కలెక్షన్స్ తో మరో రికార్డ్ ని బ్రేక్ చేశాడు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మంచి హిట్ అయింది.. తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులకు గాను 21 కోట్ల వరకు వసూలు చేసిన ఈ మూవీ.. యూఎస్ లో కూడా కలెక్షన్ల మోత మోగిస్తుంది.. సింగిల్ చిత్రం యూఎస్ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ వసూళ్లు అందుకుంటుంది. దీనితో అక్కడ సింగిల్ హాఫ్ మిలియన్ మార్క్ ని అందుకోవడం విశేషం. దీనితో శ్రీవిష్ణు కెరీర్లో మరో సాలిడ్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది అని చెప్పాలి. యూఎస్‌లోనూ $500k దాటేసింది. మొత్తానికి ఈ సినిమా మంచి టాక్నే సొంతం చేసుకుంది.. ఇంకా పెరిగే అవకాశం ఉందని సినీ ట్రేడ్ పంతులు అంటున్నారు.


Also Read: హీరోయిన్ లయ భర్తకు దూరం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా..?

సింగిల్ స్టోరీ విషయానికొస్తే.. 

హీరో శ్రీ విష్ణు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. మొదట్లో కాస్త ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఈమధ్య హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న శ్రీ విష్ణు స్వాగ్ మూవీతో నిరాశ పరిచాడు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తనదైన శైలిలో డిఫరెంట్ స్టోరీలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సింగిల్ మూవీ కూడా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించింది. బ్యాంకులో మంచి ఉద్యోగం, జీతం ఉన్నా ఎందుకో సింగిల్ గానే ఉండిపోయాడు విజయ్. కార్ల షోరూం లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేసే పూర్వ ను ప్రేమిస్తాడు. కానీ.. విజయ్ ను హరిణి ప్రేమిస్తుంది.. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరి ప్రేమ గెలిచింది? ఈ ప్రేమకథలో తలెత్తిన ఇబ్బందులు ఏమిటి? చివరికి విజయ్ సింగిల్ గా మిగిలిపోయాడా? లేదా ఓ ఇంటి వాడు అయ్యాడా అన్నది స్టోరీలో చూడాలి..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×