BigTV English

Extra Ordinary Man : విజయ్, రష్మిక సీక్రెట్ పై క్లారిటీ ఇచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ..

Extra Ordinary Man : విజయ్, రష్మిక సీక్రెట్ పై క్లారిటీ ఇచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ..

Extra Ordinary Man : విజయ్ దేవరకొండ, రష్మిక.. వీరి మధ్య ఏదో నడుస్తోంది అన్న టాపిక్ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. పైగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉండడం గాసిప్స్ కి మరింత ఫేవరెట్ గా మారింది. గీతా గోవిందం మూవీలో మొదటిసారి కలిసి నటించిన ఈ జంట తమ కెమిస్ట్రీ తో అందరి దృష్టి ఆకర్షించారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంలో మరొకసారి ఇద్దరూ కలిసి నటించారు.


అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో సీక్రెట్ రిలేషన్ ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని.. కలిసి ఒకే దగ్గర కనిపించారని.. కొన్ని రకాల వార్తలు అప్పుడప్పుడు మనం వింటూ ఉన్నాం. ఇంస్టాగ్రామ్ లో ఇద్దరు షేర్ చేసే ఫోటోలను కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యాచ్ చేసి మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని హాయ్ నాన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వీళ్ళిద్దరికీ సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది.

మృణాల్ తో పిక్చర్ గేమ్ ఆడుతున్న సుమ.. స్క్రీన్ పై పిక్చర్స్ చూపిస్తూ వాటికి మృణాల్ ను కామెంట్ చేయమని అడిగింది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ సడన్గా ఆ ఫోటోలో మధ్యలో రష్మిక, విజయ్ దేవరకొండ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఒక ఫోటో డిస్ప్లే చేశారు. నిజానికి అవి రెండు వేరు వేరు ఫోటోలు అయితే ఎవరో రెండు ఫోటోలను క్లబ్ చేసి అప్పట్లో ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు అంటూ ప్రచారం చేసిన ఫోటోని అది. ఆ ఫోటో అలా సడన్ గా రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత అది చిన్న టెక్నికల్ ఇష్యూ అని చెప్పారనుకోండి .అయితే ఈ ఇద్దరి రిలేషన్ గురించి జోరుగా సాగుతున్న ప్రచారానికి నితిన్ సమాధానం ఇచ్చాడు.


నితిన్ మూవీ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ లో విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ పై అందరికీ తనదైన స్టైల్ లో పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఇందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే కదా.. ఇక ఆ సదరు జూనియర్ ఆర్టిస్ట్ ని విజయ్, రష్మిక రిలేషన్ ఏంటి అని క్వశ్చన్ అడిగినప్పుడు.. అల్లు అర్జున్ జులాయి సాంగ్ తో ఘాటుగా సమాధానం ఇచ్చాడు. జులాయి మూవీలో టైటిల్ సాంగ్ ఉంది చూడండి..”నేనేం చేస్తే నీకేంటి?”అంటూ సాగే ఆ పాటతో నితిన్ తన రిప్లై ఇచ్చాడు.

నితిన్ ఆ సాంగ్ ని వీళ్ళ రిలేషన్ తో మీకేం పని..అని ఎదురు ప్రశ్నిస్తున్నట్లు కాస్త మార్చి..వాళ్ళు ఏం చేస్తే మీకేంటి? అంటూ స్టెప్పులు కూడా వేశాడు. కొంతమంది ఈ సీన్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయడమే కాకుండా తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ, రష్మిక పేర్లని ట్యాగ్ చేసి వైరల్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పై రష్మిక, విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×