BigTV English

Liger : ‘లైగర్’ డిజాస్ట‌ర్‌పై రియాక్ట్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Liger : ‘లైగర్’ డిజాస్ట‌ర్‌పై రియాక్ట్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Liger : విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ . భారీ అంచ‌నాల‌తో రూపొందించిన ఈ చిత్రం ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ అయ్యింది. మూవీ కార‌ణంగా పూరి ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను కూడా ఫేస్ చేస్తున్నారు. ఇటు పూరి, అటు విజ‌య్ దేర‌వ‌కొండ చాలా రోజుల పాటు మీడియాకు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ‘లైగర్’ డిజాస్ట‌ర్‌పై స్పందించారు. ఆ సినిమాలో తాను చేసిన న‌త్తి పాత్ర‌ను ఆస్వాదించాన‌ని చెప్పిన రౌడీ స్టార్ లైగ‌ర్ చాలా పెద్ద సినిమా అని, అందులో న‌టించ‌ట‌మంటే గొప్ప అవ‌కాశం అన్ని అన్నారు.


‘లైగర్’ సినిమా కోసం శారీర‌కంగా, మాన‌సికంగా నేను ఏం చేయాలో వాట‌న్నింటినీ చేశాను. సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం దేశ‌మంతా తిరిగాను. కానీ మేం ఆశించిన రిజ‌ల్ట్ రాలేదు. లైఫ్‌లో స‌క్సెస్ ఫెయిల్యూర్ ఎదుర‌వుతుంటాయి. ప్ర‌తీసారి స‌క్సెస్ రావ‌చ్చు.. రాక‌పోవ‌చ్చు కానీ మ‌నం ప్ర‌య‌త్నాన్ని ఆప‌కూడ‌దు. త‌ప్పు చేశామంటే తెలియ‌ని విష‌యాన్ని ఏదో మ‌నం నేర్చుకున్నామ‌నే, చేయ‌లేదంటే మ‌నం నెక్ట్స్ లెవ‌ల్‌కి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించ‌టం లేద‌ని అర్థం’’ అన్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ‘లైగర్’ చిత్రం అన‌న్య పాండే హీరోయిన్‌. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కూడా ఈ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.


Tags

Related News

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Big Stories

×