Big Stories

Rohit Fan: గీత దాటిన అభిమానం.. రూ.6.5 లక్షల జరిమానా..

- Advertisement -

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్-MCGలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. భారత్ విధించిన లక్ష్యాన్ని అందుకోడానికి జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… ఓ యువ అభిమాని సెక్యూరిటీ కళ్లు కప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి నేరుగా వెళ్లి… అతన్ని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. అతని వెనకాలే పరుగు పరుగున వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది… ఈలోగానే అతణ్ని పట్టేసుకున్నారు. దాంతో కనీసం ఒక్కసారి షేక్ హ్యాండ్ అయినా ఇవ్వాలని ఆ అభిమాని రోహిత్ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ… భధ్రతా కారణాల రీత్యా సెక్యూరిటీ సిబ్బంది ఏ మాత్రం కనికరించలేదు. రెండు చేతులు వెనక్కి కట్టి మైదానం నుంచి అతణ్ని బయటికి లాక్కెళ్లిపోయారు.

- Advertisement -

ఎంత అభిమానం ఉన్నా… ఆటగాళ్లు కూడా తమ భద్రత దృష్ట్యా మైదానంలో ఎవరినీ దగ్గరికి రానియ్యరు. రోహిత్‌ కూడా అలాగే చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అభిమానులు గ్రౌండ్‌లోకి రావడం ఇది రెండో సారి. వరుస ఘటనలతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో… సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించిన అభిమానికి… క్రికెట్ ఆస్ట్రేలియా భారీ జరిమానా విధించింది. భారత కరెన్సీలో ఏకంగా రూ.6.5 లక్షల ఫైన్ వేసింది. అభిమానంతో గీత దాటిన ఆ అభిమాని… అంత మొత్తాన్ని ఎలా చెల్లిస్తాడోనని అంతా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లపై గుండెల్లో ఎంత అభిమానం ఉన్నా… అదంతా స్టాండ్స్ లోనే చూపించాలని… నిబంధనలు ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించొద్దని సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News