Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన విభిన్నమైన పాత్రలు మరియు సహజమైన నటనతో యువతలో భారీ అభిమాన గణాన్ని సంపాదించాడు విజయ్. రౌడీ హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.హిట్ ఫట్‌తో సంబంధం లేకుండాఈ.. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించగా, మరికొన్ని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా విజయ్ కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హాజరైన ఓ కార్యక్రమానికి అటెండ్ అయ్యాడు. అది కింగ్ డమ్ లుక్ కావడం విశేషం
కింగ్‌డమ్ లుక్‌తో ఢిల్లీకి..
ఢిల్లీ వేదికగా జరుగుతున్న వాట్ ఇండియా థింక్స్ టుడే సమిట్‌లో అనేక మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. అలాగే.. సినిమా, క్రీడలు, పరిశ్రమ నుంచి కూడా అనేక మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. టాలీవుడ్ నుంచి హీరో విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్‌డమ్ (Kingdom) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో షార్ట్ హెయిర్‌తో కనిపించాడు. ఇప్పుడు ఇదే లుక్‌లో విజయ్ ఢిల్లీలో దర్శనమిచ్చాడు. అయితే.. ఇదే సమయంలో విజయ్ నుంచి వచ్చిన కొత్త యాడ్‌లో మాత్రం లాంగ్ హెయిర్‌తో అదిరిపోయే లుక్‌లో కనిపించాడు.
యాడ్ కోసం నయా లుక్!
విజయ్ దేవరకొండకు యూత్‌లో భారీ క్రేజ్ ఉంది. దీంతో.. కమర్షియల్‌గా కూడా దూసుకుపోతున్నాడు రౌడీ. వివిధ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేస్తూ ప్రజాదరణ పొందాడు. అనేక కంపెనీలు అతన్ని తమ ప్రకటనల్లో భాగం చేసుకున్నాయి. ఫుడ్ డెలివరీ లాంటి యాడ్స్‌తో పాటు కూల్ డ్రింక్స్‌కు సంబంధించిన యాడ్స్ కూడా చేశాడు. లేటెస్ట్‌గా విజయ్ సేల్స్ అంటూ తెలుగు యాడ్ ఒకటి చేశాడు. ఇందులో విజయ్ సరికొత్త లుక్‌లో కనిపించాడు. తన గురించి తానే చెబుతూ.. ఎవరో కొత్త స్టార్ వచ్చాడంటూ.. లాంగ్ హెయిర్‌లో మస్త్ ఉన్నాడు విజయ్. దీంతో.. రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సినీ ప్రయాణం!
నువ్విలా సినిమాతో తెరపైకి అడుగుపెట్టిన విజయ్.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలోను ఒక చిన్న పాత్రలో నటించాడు. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. సోలో హీరోగా మాత్రం పెళ్ళి చూపులు సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమా విజయ్‌కి తొలి పెద్ద విజయాన్ని అందించింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు విజయ్. అర్జున్ రెడ్డితో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు. ఇదే జోష్‌లో వచ్చిన గీత గోవిందం సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దగ్గర చేసింది. ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, లైగర్, ఖుషి,ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో.. రాబోయే సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సమ్మర్ కానుకగా రానున్న కింగ్‌డమ్ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత రాహుల్ సాంకృత్యన్‌తో పాటు.. కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనర్థాన్ అనే సినిమా చేస్తున్నాడు.